న్యూఢిల్లీ /ఓసాకా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. ఇప్పటికే టారిఫ్ కింగ్ అని ఇండియానుద్దేశించి పేర్కొన్న ట్రంప్ తాజాగా అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తూ ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. జపాన్‌లో జీ 20 సమ్మిట్ సందర్బంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ చర్చకు దారి తీసింది. ప్రధానంగా అమెరికాపై విధించిన టారిఫ్‌లను ఇందులో టారిఫ్‌లు ఆమోద యోగ్యంకాదు.. తగ్గించాల్సిందే అంటూ డిమాండ్ చేయడం గమనార్హం.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు చూస్తున్నాను. భారత్ చాలా ఏళ్లుగా అమెరికా ఉత్పత్తులపై దిగుమతులపై భారీగా విధిస్తూ వస్తోంది. ఇటీవలే మళ్లీ సుంకాలను పెంచింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఈ సుంకాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా దిగుమతి సుంకాల పెంపును వాయిదా వేస్తూ వచ్చిన భారత్ ఈ నెల ప్రారంభంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్, వాల్‌నట్స్, ఆపిల్స్ తదితర దాదాపు 29 ప్రొడక్టులపై సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. అటు జపాన్‌లోని ఓసాకా నగరంలో జరుగుతున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సహా వివిధ దేశాలకు చెందిన కీలక నేతలతో మోదీ భేటీ కానున్నారు.
I look forward to speaking with Prime Minister Modi about the fact that India, for years having put very high Tariffs against the United States, just recently increased the Tariffs even further. This is unacceptable and the Tariffs must be withdrawn!
— Donald J. Trump (@realDonaldTrump) June 27, 2019
Comments
Please login to add a commentAdd a comment