
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన విషయంగా నిలిచింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖంగా వినిపించిన అంశాలపై అమెరికాకు చెందిన టాక్‌వాకర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ అత్యధికంగా 39,252 సార్లు ప్రస్తావనకు రాగా, తరువాతి స్థానాల్లో వరసగా మహిళలు(35,837), అమెరికా ఫస్ట్(31,449), సంపద(22,896), కృత్రిమ మేధ(19,018), ప్రపంచీకరణ(16,513), వాతావరణ మార్పులు(15,477)అనే హ్యాష్‌ట్యాగ్‌లున్నాయి.
వ్యక్తుల పరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (2.73 లక్షల సార్లు) అగ్ర భాగంలో నిలిచారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా, జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ ఉన్నారు. ఈసారి దావోస్ పేరు సామాజిక మాధ్యమాల్లో 20.20 లక్షల సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు టాక్‌వాకర్ వెల్లడించింది. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రికార్డు స్థాయిలో నెటిజెన్లు 10 లక్షల ట్వీట్లు చేసినట్లు సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న సోషల్ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిపబ్లిక్ డే హ్యాష్‌ట్యాగే ఎక్కువగా ప్రచారమైనట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment