అర్ణబ్ డేకు ప్రతిష్టాత్మక అవార్డు | Indian-American scientist wins Springer Theses Award | Sakshi
Sakshi News home page

అర్ణబ్ డేకు ప్రతిష్టాత్మక అవార్డు

Published Sun, May 29 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

అర్ణబ్ డేకు ప్రతిష్టాత్మక అవార్డు

అర్ణబ్ డేకు ప్రతిష్టాత్మక అవార్డు

సింగపూర్: భారత సంతతికి చెందిన అమెరికన్ ‘అర్ణబ్ డే’ కి ప్రతిష్టాత్మక ‘స్ప్రింగర్ థీసిస్ అవార్డు' వరించింది. కణితి అణిచివేతకు సంబంధించి అభివృద్ది చేసిన జన్యుమార్పిడి ప్రయోగానికి అర్ణబ్‌కు ఈ సత్కారం లభించింది. అత్యున్నతమైన పీహెచ్‌డీ థీసిస్‌కి ప్రపంచలోనే ప్రసిద్దిగాంచిన బుక్ పబ్లిషర్ ‘స్ప్రింగర్’ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. ఇదే ప్రయోగానికి ‘యంగ్ ఇన్విస్టిగేటర్ అవార్డు’ను అమెరికన్ పెప్టైడ్ సింపోసియమ్ బహూకరించింది.

అంతేకాకుండా తన పీహెచ్‌డీలో భాగంగా మధుమేహ చికిత్సావిధానానికి పెప్టైడ్ సంబంధిత ప్రోడ్రగ్స్‌ను అభివృద్ది చేశారు. ఈ సిద్దాంతం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీకి నామినేట్ అయింది. ఈ ప్రయోగాన్ని భారత యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన మాజీ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కి అంకితం ఇస్తున్నట్లు అర్ణబ్ అప్పట్లో ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement