అమెరికాలో ప్రముఖ ఎన్నారై శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్కు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్లోని ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్కు చెందిన నేషనల్ సైన్స్ బోర్డులో సభ్యునిగా సేతురామన్ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఈ మేరకు యూఎస్ అధ్యక్ష భవనం వైట్హౌస్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు.
అనంతరం చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటడ్లో డేటా కమ్యూనికేషన్ ఇంజినీరుగా సేతురామన్ విధులు నిర్వహించారు. మరి కొన్నాళ్లకు ఐఐటీ నుంచి ఎంటెక్ పట్టా అందుకున్నారు. ఆ క్రమంలో కెనడా పయనమై యూనివర్శిటీ ఆఫ్ ఒట్టావా నుంచి పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో పలు కీలక పదవులు నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక రంగంపై ఇప్పటి వరకు ఆయన దాదాపు 400పైగా పత్రాలు ప్రచురితమైనాయి.