కేన్సర్‌కు భారత సంతతి బాలుడి చికిత్స
లండన్: మందులకు లొంగని, అత్యంత ప్రమాదకర ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్‌కు ఓ 16 ఏళ్ల భారత సంతతి బాలుడు చికిత్స కనుగొన్నాడు. ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్‌ను ఔషధాలకు స్పందించేలా మార్చగలిగిన విధానాన్ని తాను కనిపెట్టినట్లు యూకేలో నివసించే క్రితిన్ నిత్యానందం తెలిపాడు. సాధారణంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఇతర ఎదుగుదల హార్మోన్ల వల్ల రొమ్ము కేన్సర్ వస్తుంది.
మందులు వాడి వీటిని నియంత్రించడం వల్ల కేన్సర్ గండం నుంచి గట్టెక్కవచ్చు. అయితే ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్ అంత సులభంగా వదిలేది కాదు. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ.. మూడింటినీ కలిపి చికిత్స చేస్తేనే ఇది నయమవుతుంది. ఐడీ 4 అనే ప్రొటీన్‌నును, దానిని ఉత్పత్తి చేసే జన్యువులను నియంత్రించడం వల్ల ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్ ను మందులకు స్పందించేదిగా చేయవచ్చని క్రితిన్ తెలిపాడు.