Breast Cancer Treatment
-
అమ్మకు, అమ్మమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కచ్చితంగా వచ్చేస్తుందా?
నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. మా అమ్మకు, అమ్మమ్మకు 50వ ఏట బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు కూడా అలా వచ్చే చాన్స్ ఉందా? ఎలాంటి టెస్ట్‌లు చేయించాలి? టెస్ట్‌ల ద్వారా ముందుగా కనుక్కోవచ్చా? – జి. చిన్ని, ఎమ్మిగనూరు కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఆ కుటుంబ సభ్యులు 25వ ఏట నుంచే గైనకాలజిస్ట్‌ని లేదా జెనెటిక్ కౌన్సెలర్‌ని కలవాలి. ఇప్పుడు ఫ్యామిలీ క్యాన్సర్ క్లినిక్స్, జెనెటిక్ క్లినిక్స్ చాలా చోట్ల ఉంటున్నాయి. ఈ రకమైన కన్సల్టేషన్‌లో.. మీ కుటుంబంలో ఏవిధమైన క్యాన్సర్ ఉంది? అది వంశపారంపర్యంగా మీ జీవితం కాలంలో మీకు వచ్చే చాన్స్ ఎంత? ఎలాంటి టెస్ట్‌తో ముందే కనిపెట్టి చెప్పవచ్చు? ఏ టెస్ట్‌తో నివారించవచ్చు? వంటివాటితో రిస్క్‌ను అంచనా వేస్తారు. కొన్ని జన్యుపరమైన పరీక్షలను సూచిస్తారు. కేవలం 5 శాతం బ్రెస్ట్ క్యాన్సర్స్ మాత్రమే వంశపారంపర్యంగా వస్తాయి. కుటుంబంలో ఆల్టర్డ్ జీన్ కనుక ఉంటే తర్వాత తరానికీ బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్స్‌కి చాలా వరకు వంశ పరంపర ఉండదు. మీ కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు ప్రతి నెలసరి తరువాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం తెలుసుకోవాలి. ఏడాదికోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామూలుగా అయితే దీన్ని 40 ఏళ్లకి మొదలుపెడతారు. 50 ఏళ్లు వచ్చేవరకు ప్రతి ఏడు ఈ పరీక్షను చేయించుకోవాలి. 50–70 ఏళ్ల మధ్య ప్రతి మూడేళ్లకోసారి మామోగ్రఫీ చేయించుకోవాలి. మామోగ్రఫీ అంటే ఎక్స్ రేతో చేసేది. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. నొప్పిలేని లంప్ ఏదైనా చేయికి తగిలినా.. బ్రెస్ట్ సైజ్, షేప్ మారినా, స్కిన్‌లో తేడా కనిపించినా.. నిపిల్ డిశ్చార్జ్ ఉన్నా.. చంకల్లో వాపు ఉన్నా.. వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. పెయిన్ అనేది చాలావరకు క్యాన్సర్ సింప్టమ్ కాదు. జీన్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వశపారంపర్య బ్రెస్ట్ క్యాన్సర్‌కి ముఖ్యంగా బీర్సీఏ 1, బీఆర్సీఏ 2 జీన్స్ కారణం. ఇవి మీలో జీన్ చేంజెస్ అయినాయా లేదా అని జెనెటిక్ పానెల్ టెస్ట్ చేసి తెలుసుకుంటారు. జీవనశైలిలో మార్పు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించవచ్చు. ఎత్తుకు తగిన బరువును మెయిన్టేన్ చేయడం, కనీసం 30 నిమిషాల వ్యాయామాన్ని వారానికి కనీసం అయిదురోజులు చేయడం, పౌష్టికాహారం వంటివన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడానికి దోహదపడతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలా?) -
బ్రెస్ట్ క్యాన్సర్.. ప్రతి నాలుగు నిమిషాలకొక కేసు, ఇలా గుర్తుపట్టండి
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రొమ్ముక్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) గణాంకాల ప్రకారం మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకొక కొత్త కేసు నమోదవుతోందని ఒక అంచనా. ఏటా 1,78,000 కొత్త కేసులొస్తున్నాయంటూ ఆ సంస్థ వెల్లడించింది. ప్రతి లక్షమంది మహిళల్లో 30 మంది కొత్తగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో దీని విస్తృతి ఎక్కువ. మహిళల్లో ఇంతగా కనిపించే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశల్లోనే కనుగొంటే, దాని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఈ నెల (అక్టోబరు) ‘రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం’ సందర్భంగా మహిళలను వెన్నాడే ఈ ఆరోగ్య సమస్య నివారణ, విముక్తిమార్గాల వంటి అంశాలతో ఓ కథనం. అన్ని క్యాన్సర్లలాగే రొమ్ముక్యాన్సర్ వ్యాప్తినీ డాక్టర్లు నాలుగు దశలుగా పేర్కొంటారు. ఇందులోని తొలిదశ లేదా రెండోదశల్లో దీన్ని గుర్తిస్తే వ్యాధిని సులభంగానే తగ్గించవచ్చు. మూడు, నాలుగు దశల్లో కూడా విముక్తి పొందేందుకు చాలావరకు అవకాశమున్నా... చికిత్స ఒకింత కష్టమవుతుంది. రొమ్ముక్యాన్సర్ నుంచి పూర్తిగా నయమయ్యేవారి సంఖ్య ఇటీవల చాలా ఎక్కువ. కొన్ని కారణాలు రొమ్ముక్యాన్సర్‌కు ప్రధానంగా రెండు రకాల కారణాలుంటాయి. మొదటిది నివారించలేనివీ, రెండు... నివారించగలిగే కారణాలు. ∙వయసు పెరుగుతున్నకొద్దీ రొమ్ముక్యాన్సర్ ముప్పూ పెరుగుతూ ఉంటుంది. ఇది నివారించలేని కారణం. ఇక కొందరు మహిళల్లో హార్మోన్లు ఎక్కువగా స్రవించడం. ఇవి మినహా మిగతావన్నీ దాదాపుగా నివారించదగిన కారణాలే. ఉదాహరణకు... ∙ఉండాల్సినదానికి మించి బరువు పెరగడం (ఊబకాయం). ∙ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం. ∙పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం. ముప్పు ఎవరెవరిలో... ∙రెండు రొమ్ముల్లోనూ క్యాన్సర్ వచ్చిన కుటుంబాల వారిలో ఆ కుటుంబాల్లో ఒకవేళ పురుషుల్లోనూ అదే క్యాన్సర్ వస్తే బాగా దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) రొమ్ము క్యాన్సర్ ఉండటం. వారిలోనూ 40 ఏళ్లకి తక్కువ వయసులోనే దీని బారిన పడటం. ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇతర క్యాన్సర్లు ఎక్కువగా కనిపించడం (ముఖ్యంగా అండాశయాల క్యాన్సర్స్ రావడం) ∙జీన్ మ్యుటేషన్స్ కనిపించడం, పదేళ్ల వయసుకు ముందే రజస్వల కావడం అలాగే 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడం. ముందస్తు నివారణ ఇలా... మామూలుగా క్యాన్సర్ నివారణ దాదాపు అసాధ్యమే అయినా... తొలి రెండు దశల్లో గుర్తించడం ఇంచుమించు నివారణతో సమానం. కొందరిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఇలాంటివారు కొన్ని పరీక్షలు ద్వారా తమ ముప్పును ముందే గుర్తించవచ్చు. ఇలా గుర్తించగలిగితే, వ్యాధి నుంచి ఇంచుమించు పూర్తిగా తప్పించుకున్నట్లే. ►ఊబకాయాన్ని తగ్గించుకోవడం (ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార, వ్యాయామాలతో ఎత్తుకు తగినట్లు బరువును నియంత్రించుకోవాలి). ►కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ఈ జన్యుపరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. ఆ రిపోర్టుల ఆధారంగా డాక్టర్ల కౌన్సెలింగ్‌తో...రొమ్ములుగానీ, ఫెలోపియన్ ట్యూబులు, అండాశయాలు తొలగించడం వల్ల రొమ్ముక్యాన్సర్ రాకుండానే నివారించవచ్చు. ►నివారించదగిన కారణాలను గుర్తించి, జీవన శైలిని మెరుగుపరచుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. తొలిదశలోనే రొమ్ముక్యాన్సర్ గుర్తింపు ఇలా... ►సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (ఎస్‌బీఈ) అనే సొంతంగా చేసుకునే పరీక్షల ద్వారా రొమ్ముల్లోని తేడాలను బట్టి...చాలావరకు ఎవరికివారే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం సాధ్యమే. అందుకు చేయాల్సినవి... ► మహిళలు తమ రొమ్ముల్ని తాకుతూ పరీక్షించుకున్నప్పుడు అంతకు ముందు లేని గడ్డల వంటివి చేతికి / స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. నెలసరి అయిన ఏడవరోజున, స్నానం చేస్తున్నప్పుడు సబ్బుచేతితో చూసుకోవాలి. ► చర్మంపై నుంచి తాకినప్పుడు రొమ్ములోపల గడ్డ తగులుతూ ఉన్నా లేదా రొమ్ము ఆకృతిలో మార్పు కనిపించినా, చంకల్లో ఏదైనా గడ్డ కనిపించినా డాక్టర్‌కు తెలపాలి. ►ఇలాంటి గడ్డల్లో నొప్పి లేకపోయినా, రొమ్ములో సొట్టలు ఉన్నా, రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించినా డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక నిపుల్ విషయానికి వస్తే... అది ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు తిరిగి ఉన్నా, నిపుల్ నుంచి రక్తస్రావం కనిపిస్తున్నా, పుండ్ల వంటివి కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమయ్యే వైద్యపరీక్షలు... తొలుత డాక్టర్లు భౌతికంగా పరీక్షలు చేయడం, తర్వాత మామోగ్రఫీ / ఎమ్మారై / అల్ట్రాసౌండ్, కోర్ బయాప్సీ (సూది పరీక్ష), అవసరమైతే జెనెటిక్ స్క్రీనింగ్‌తో నిర్ధారణ చేస్తారు. అన్ని సందర్భాల్లోనూ ఈస్ట్రోజెన్ రిసెప్టర్, ప్రొజెస్టిరాన్ రిసెప్టర్, హర్–2 పరీక్షలూ; కొన్ని సందర్భాల్లో ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ ∙ఛాతీ ఎక్స్‌రే ∙కడుపు స్కానింగ్‌తో పాటు అవసరమైతే ఎముకల స్కానింగ్ (మూడో దశలో) లేదా పెట్‌స్కాన్ చేస్తారు. చికత్స మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. తొలి లేదా రెండో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ను దాదాపుగా పూర్తిగా తగ్గించవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు అవసరం పడవచ్చు. క్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. అప్పుడు మొదట సర్జరీ చేసి, వ్యాప్తి నివారణ కోసం ఆ తర్వాత హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్‌ను మొదటిదశలోనే కనుగొంటే ఆంకో΄్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును పూర్తిగా రక్షించడమూ సాధ్యమే. -డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. -
రొమ్ము క్యాన్సర్ ముప్పును ముందే గుర్తించండి!
రొమ్ముక్యాన్సర్‌కు అనేక అంశాలు కారణమవుతాయి. అందులో కొన్ని మనం నివారించగలవి. మరికొన్ని నివారించలేనివి. ఉదాహరణకు... నివారించలేని వాటిల్లో వయసు అనేది ముప్పును పెంచే అతి ముఖ్యమైన అంశం. వయసు ఎంతగా పెరుగుతుంటే.. రొమ్ము క్యాన్సర్ ముప్పు అంతగా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం 30 నుంచి 39 ఏళ్ల మహిళల్లో ప్రతి 233 మందిలో ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం చదవండి: మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్ కుటుంబ నేపథ్యం: దగ్గరి బంధువుల్లో (అంటే... అమ్మ, సోదరి, కూతుళ్ల)లో రొమ్ముక్యాన్సర్ ఉన్నట్లయితే... తమకూ రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. వ్యక్తిగత నేపథ్యం: ఇదివరకే రొమ్ముక్యాన్సర్ ఉన్నవారైతే... వారికి అదే రొమ్ములోగానీ మరోపక్క రొమ్ములోగానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజెన్: ఈస్ట్రోజెన్ హార్మోన్ రొమ్ముకణాలను ఉత్తేజపరుస్తుంది. అలా దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌కు గురికావడం కూడా రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అయితే ఈస్ట్రోజెన్‌ను నియంత్రించడం కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్నవయసులోనే అంటే పన్నెండేళ్ల కంటే తక్కువ వయసులోనే నెలసరి ప్రారంభం కావడం, అలాగే 55 ఏళ్లు తర్వాత బహిష్టు ఆగిపోవడం (మెనోపాజ్) లాంటి కారణాలతో ఈస్ట్రోజెన్ స్రావాలు చాలా సుదీర్ఘకాలంపాటు కొనసాగితే కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్ కూడా ఎవరి చేతుల్లోనూ ఉండదు. (అంటే మాంసాహారంలో ఉండే హార్మోన్ల వల్ల, పురుగుమందుల అవశేషాల కారణంగా దేహంలోకి ప్రవేశించే ఈస్ట్రోజెన్‌ను పోలిన అంశాలు కూడా ఈ ముప్పును పెంచుతాయి). చదవండి: ఒక ఓవరీ తీసేశారు.. నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? గర్భధారణ... పిల్లలకు తల్లిపాలు పట్టించడం : గర్భం రావడంతో పాటు చిన్నారికి రొమ్ముపాలు పట్టించడం వంటి అంశాలు నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ముప్ఫయి ఏళ్లు పైబడేవరకు గర్భం ధరించని మహిళల్లో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే చాలాకాలం పాటు... అంటే ఏడాది మొదలుకొని ఏడాదిన్నర లేదా రెండేళ్ల వరకు తల్లిపాలనే తాగించే మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పు తక్కువ. కానీ ఈరోజుల్లో అంత సుదీర్ఘకాలం పాటు తల్లిపాలు పట్టించడం సాధ్యంకావడంలేదు. కొన్నిసార్లు మన చేతిలో ఉన్న అంశాలపరంగా (అంటే మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి) తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా రొమ్ముక్యాన్సర్ రావచ్చు. అలాంటప్పుడు కుంగిపోకూడదు. సాధారణంగా బ్రెస్ట్‌క్యాన్సర్ అన్నది రొమ్ములో కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పి లేకుండా, గట్టిగా, సమానమైన అంచులు లేకుండా ఉండవచ్చు. మరికొన్నిసార్లు మెత్తగా, సమానంగా కూడా ఉండవచ్చు. కాబట్టి రొమ్ముల్లో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవడం మంచిది. సాధారణంగా రొమ్ముక్యాన్సర్ సోకినప్పుడు ఈ కింద పేర్కొన్న మార్పులు కనిపిస్తాయి. అవి... చదవండి: షుగరూ, హైబీపీ అదుపులో ఉంటే కిడ్నీలూ పదిలమే ►రొమ్ముల్లో వాపు, ఇరిటేషన్, నొప్పి, చనుమొనల్లో నొప్పి, చనుమొనలు లోపలివైపునకు కుంగినట్లుగా అయిపోవడం, ఎరుపెక్కడ, చనుమొనల నుంచి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకల కిందిభాగంలో గడ్డలు ఉండటం... మొదలైనవి. అయితే అన్ని రకాల గడ్డలూ క్యాన్సర్ కాకపోవచ్చు. కాబట్టి డాక్టర్ చేత క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని, అది క్యాన్సరా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం మంచిది. ►క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. దాన్ని త్వరగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడమే సరైన మార్గం. ►ఇరవై ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. ∙20 నుంచి 40 ఏళ్ల వయసు మహిళలు ప్రతి మూడేళ్లకోసారి డాక్టర్ ఆధ్వర్యంలో రొమ్ము పరీక్షలు జరిగేలా చూసుకోవాలి. ►40 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ పరీక్ష చేయించుకోవాలి. ►40 –49 ఏళ్ల మహిళలు ప్రతి రెండేళ్లకోసారి డిజిటల్ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఏడాదీ డిజిటల్ మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి. ►డిజిటల్ మామోగ్రఫీ అనేది డిజిటల్ రెసెప్టార్తో కంప్యూటర్‌కు అనుసంధానం చేసిన ఒక ఆధునిక ఎక్స్–రే మెషీన్‌గా చెప్పవచ్చు. దాని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అధునాతన డిజిటల్ మామోగ్రఫీ మెషీన్స్‌తో బెడ్లో కాసేపు పడుకుని లేదా కూర్చుని కూడా అత్యంత వేగంగా బయాప్సీని నిర్వహించవచ్చు. మామోటోమ్ వంటి వాక్యూమ్ పవర్డ్ పరికరాల వల్ల అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్ బయాప్సీ చేయవచ్చు. ఈ పరీక్షల సహాయంతో రొమ్ముక్యాన్సర్ లేదని నిర్ధారణ అయితే నిశ్చింతగా, నిర్భయంగా ఉండవచ్చు. ఒకవేళ ఉందని తేలితే వెంట -
కేన్సర్‌కు భారత సంతతి బాలుడి చికిత్స
లండన్: మందులకు లొంగని, అత్యంత ప్రమాదకర ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్‌కు ఓ 16 ఏళ్ల భారత సంతతి బాలుడు చికిత్స కనుగొన్నాడు. ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్‌ను ఔషధాలకు స్పందించేలా మార్చగలిగిన విధానాన్ని తాను కనిపెట్టినట్లు యూకేలో నివసించే క్రితిన్ నిత్యానందం తెలిపాడు. సాధారణంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఇతర ఎదుగుదల హార్మోన్ల వల్ల రొమ్ము కేన్సర్ వస్తుంది. మందులు వాడి వీటిని నియంత్రించడం వల్ల కేన్సర్ గండం నుంచి గట్టెక్కవచ్చు. అయితే ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్ అంత సులభంగా వదిలేది కాదు. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ.. మూడింటినీ కలిపి చికిత్స చేస్తేనే ఇది నయమవుతుంది. ఐడీ 4 అనే ప్రొటీన్నును, దానిని ఉత్పత్తి చేసే జన్యువులను నియంత్రించడం వల్ల ట్రిపుల్ నెగెటివ్ రొమ్ము కేన్సర్ ను మందులకు స్పందించేదిగా చేయవచ్చని క్రితిన్ తెలిపాడు. -
నాట్కోకు తొలిగిన అడ్డంకి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్సలో వినియోగించే అబ్రాక్సిస్ ఔషధ పేటెంట్ విషయంలో రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. అమెరికా సంస్థ అబ్రాక్సిస్ బయోసెన్సైస్ ఔషధ ఉత్పత్తి అయిన అబ్రాక్సేన్‌కు పేటెంట్ మంజూరులో చుక్కెదురయింది. అబ్రాక్సేన్ తయారీలో మేథో హక్కులకేమీ భంగం కలగడం లేదని, ఉత్పత్తి విధానం సరళమైనది కావడంతో అబ్రాక్సిస్కు పేటెంట్ జారీ చేయరాదని నాట్కో కంపెనీ పేటెంట్ సంస్థ ఎదుట తన వాదనలు వినిపించింది. నాట్కో వాదనలతో ఏకీభవించిన పేటెంట్ కార్యాలయం అబ్రాక్సేన్‌కు పేటెంట్ నిరాకరిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. ఇది దేశీయ కంపెనీలకు ఎంతో ఊరట కలిగించే పరిణామం.వివరాల్లోకెళితే... అబ్రాక్సేన్‌కు సరిసమానమైన బయోసిమిలర్ అల్బూపాక్స్ను నానోటెక్నాలజీ ఆధారంగా నాట్కో సంస్థ 2008లోనే ఉత్పత్తి చేసింది. టాక్సిన్లు (విష పూరితాలు) అధికంగా ఉండే ఈ ఔషధ వినియోగం ఎంత మాత్రం సురక్షితం కాదని అబ్రాక్సిస్ లోకల్ పార్ట్నర్ బెంగుళూరుకు చెందిన బయోకాన్ సంస్థ డ్రగ్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో నాట్కో ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంది. 2011లో డ్రగ్ కంట్రోలర్ అభ్యంతరాలను తోసిరాజని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాట్కో ఔషధ ఉత్పత్తికి అనుమతించినా సంస్థ ముందుకు రాలేదు. పేటెంట్ కార్యాలయంలో పోరాటం తప్ప ఉత్పత్తి మార్కెట్లోకి తెచ్చే విషయంలో ఉత్సాహం చూపించలేదు. అడ్డు తొలిగింది.. అయినా నిరుత్సాహమే... ఇదీ రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మా పరిస్థితి. కేన్సర్స్ చికిత్సకు సంబంధించి కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తెచ్చేందుకు ఎప్పుడూ ముందుండే నాట్కో అల్బూపాక్స్ ఔషధ విషయంలో జంకుతోంది. రూ 200 కోట్ల రొమ్ము కేన్సర్ మార్కెట్లో నాట్కో పొందాల్సిన ప్రతి ఫలాన్ని పోటీ సంస్థలైన సిప్లా, పెనేషియా బయోటెక్, ఫ్రెసీనియస్ కాబీ ఆంకాలజీ ఇండియా (గతంలో డాబర్ ఇండియా ) లాంటి సంస్థలు అనుభ విస్తున్నాయి. మేధో హక్కుల పోరాటం చేస్తున్న నాట్కో ఫార్మా మాత్రం ఈ డ్రగ్ తయారీపై వెనకంజ వేయడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయమై కంపెనీ అధికారుల్ని సంప్రదించడానికి ప్రయత్నించినా, వారు అందుబాటులోకి రాలేదు. ఏడాదిలో మూడింతలు పెరిగిన నాట్కో షేర్... నాట్కో ఫార్మా స్టాక్ మార్కెట్లో ఒక ఏడాదిలో మూడింతలు పెరిగింది. పేటెంట్ తీర్పు ఈ నెల 18న వెల్లడైంది. 20 వ తేదీన కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట ధర రూ. 1210కి చేరింది. గత నెలరోజులుగా చూస్తే షేర్ కనిష్ట ధర రూ. 725.90 కాగా గరిష్ట ధర రూ. 725.90గా నమోదైంది. ఇక గత వారం రోజుల్లో షేర్ ధర మాంచి జోరు మీదుంది. కనిష్ట ధర రూ. 941 కాగా గరిష్ట ధర రూ. 1210. అంటే వారం రోజుల్లో షేర్ ధర రూ.270 పెరిగింది. నెల రోజుల వ్యవధిలో రూ 485 పెరగటం గమనార్హం. షేర్ 52 వారాల కనిష్ట ధర రూ. 430 గతేడాది జూలైలో నమోదైంది.