
సాక్షి : నాలుక ఒకసారి రుచి మరిగితే మళ్లీ మళ్లీ దాన్నే తినాలనిపిస్తోంది. పాములను తినడాని అలవాటుపడిన రాబర్ట్ నబబన్(37) అనే వ్యక్తి అందుకోసం ఓ సాహసం చేశాడు. ఏకంగా దారికి అడ్డొచ్చిన 25.6 అడుగుల(7.8 మీటర్లు) పైథాన్‌తో పోరాడి మట్టి కరిపించాడు. స్థానికుల సాయంతో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న రాబర్ట్ నబబన్ 25.6 అడుగుల భారీ కొండచిలుని హతమార్చాడు. ఈ సంఘటన ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
పాములను తినడానికి అలవాటు పడిన రాబర్ట్ నబబబన్ భారీ కొండచిలువను వేటాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అది ఎదురు దాడి చేసి అతన్ని మింగేయాలని యత్నించింది. అయితే అది గమనించిన స్థానికులు అంతా కలిసి దానిని చంపేశారు. ఎడమ చేయి తీవ్ర గాయం కావటంతో రాబర్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇక్కడి దాకా బాగానే ఉన్న తర్వాతే అసలు విషయం జరిగింది.
చనిపోయిన కొండచిలువతో తొలుత చిన్నారులు ఆడుకున్న ఫోటోలు చూశాం. కానీ, తర్వాత పోలీసులు వచ్చే లోపు గ్రామస్తులు తీసుకెళ్లి కోసి వాటాలు వేసుకున్నారంట. ఆపై ఎంచక్కా దానిని వండుకొని తినేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment