వేడి వేడి ఇన్సూరెన్సు స్కీములండీ.....!
వేడి వేడి ఇన్సూరెన్సు స్కీములండీ.....!
Published Fri, May 30 2014 3:26 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
వేడి వేడి సమోసాలు, వేడి వేడి బజ్జీలు అమ్ముకోవడం చూశాం. కానీ వేడివేడి వేసవిని అమ్ముకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే తక్షణం చైనా వెళ్లండి. చైనాలో ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. చెమటలు కారిపోతున్నాయి. దీన్ని సొమ్ముచేసుకోవాలనుకుంది ఓ ఇన్సూరెన్స్ కంపెనీ. అంతే వేసవి బీమా స్కీమును ప్రవేశ పెట్టింది.
ఈ ఇన్సూరెన్స్ కంపెనీనుంచి మీరు 10 యువాన్ల ఇన్సూరెన్సు పాలసీని తీసుకుంటే 37 డిగ్రీల సెల్సియస్ కు మించిన టెంపరేచర్ కొన్ని రోజుల పాటు నిరంతరాయం ఉంటే చాలు. ఆ తరువాత నుంచి ప్రతి రోజుకి 5 యువాన్ల చొప్పున డబ్బు పొందవచ్చు. ఇలా ఎన్నాళ్లుంటే అన్నాళ్లు రిటర్న్ లు ఉంటాయి.
ఈ స్కీముకి ఇప్పుడే ప్రీమియం కట్టాలి. కానీ అది వర్తించేది మాత్రం జూన్ 23 నుంచి ఆగస్టు 23 వరకూ. చైనాలో ఇప్పుడే 41 డిగ్రీల టెంపరేచర్ ఉంది. దీంతో ప్రజలు ఎగబడి, తెగబడి ఇన్సూరెన్సు పాలసీలు కొనేసుకుంటున్నారు. గత అయిదు రోజుల్లోనే దాదాపు 120 లక్షల మంది ఈ స్కీము పాలసీలు కొనేసుకున్నారు.
చైనా ప్రజలు 'ఎండమ్మ రావే.... యువాన్లు తేవే' అని పాటలు పాడుకుంటున్నారు.
Advertisement
Advertisement