87వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును ' ఇంటర్ స్టెల్లర్' అనే చిత్రం దక్కించుకుంది. ఈ చిత్రంతో క్యాప్పటన్ అమెరికా దివింటర్ సోల్జర్, డాన్ ఆప్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ఎక్స్ మెన్ డేస్ ఆఫ్ ది ఫ్యూచర్ పాస్ట్ పోటీపడ్డాయి. ఇంటర్ స్టెల్లర్ చిత్రానికి క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించారు. అలాగే యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డును 'బిగ్ హీరో 6' దక్కించుకుంది.
ఇక ఉత్తమ సినిమాటోఫోగ్రఫీ చిత్రంగా 'బర్డ్మాన్' నిలిచింది. ఈ అవార్డును ఆడం స్టాక్ హౌసెన్, అన్నా పిన్నాక్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖ హాలీవుడ్ నటులు, ఇతర ముఖ్యులకు నివాళులర్పించారు. ముఖ్యంగా హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్తోపాటు ఇతరులను గుర్తు చేసుకున్నారు.
ఇంటర్ స్టెల్లర్ కు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్
Published Mon, Feb 23 2015 10:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement