ascar awards
-
రాజమౌళి ఆస్కార్ తెస్తాడా ...?
-
ఆస్కార్ అవార్డులు ఇవీ...
ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఎంజెల్స్లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా ప్రారంభమైంది. 87వ సారి జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా ఎడ్డీ రెడ్ మెన్, ఉత్తమ నటిగా జూలియన్ మూరే, ఉత్తమ దర్శకత్వ అవార్డును అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు అందుకున్నారు. దిగ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, బర్డ్ మేన్ చిత్రాలు నాలుగు విభాగాల్లో విప్లాష్ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు, నటీ నటుల ఈ వేడుకలకు హాజరయ్యారు. 87వ ఆస్కార్ అవార్డులు ఇవీ... ఉత్తమ చిత్రం: బర్డ్మేన్ ఉత్తమ నటుడు: ఎడ్డీ రెడ్ మైనే (ది థీయరీ ఆఫ్ ఎవరీ థింగ్) ఉత్తమ నటి: జూలియన్ మూరే (స్టిల్ అలైస్) ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గాంజలెజ్ ఇనారిట్టు (బర్డ్మేన్) ఉత్తమ సహాయ నటుడు: జేకే సైమన్స్ (విప్లాష్) ఉత్తమ సహాయ నటి: పాట్రికియా ఆర్క్విటే (బాయ్ హుడ్) ఉత్తమ విదేశీ చిత్రం: ఐదా ఉత్తమ రచనా- అడాప్టడ్ స్క్రీన్ ప్లే: గ్రహం మూరే, ది ఇమిటేషన్ గేమ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: అలెజాండ్రో జీ ఇనారిట్టు, నికోలాస్ గియాకోబోన్, అలెగ్జాండర్ డైన్లారిస్, ఆర్మాండో బో, (బర్డ్మేన్) ఉత్తమ సినిమాటోఫోగ్రపీ: ఇమ్మాన్యుయెల్ లూబెజ్కీ(బర్డ్మేన్) ఉత్తమ సంగీతం-ఒరిజినల్ స్కోర్: అలెగ్జాండ్రె డెస్ప్లాట్ ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైల్: ఫ్రాన్సెస్ హన్నాన్ అండ్ మార్క్ కొలియర్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ కాస్ట్యుమ్ డిజైన్: మిలేనా కెనానిరో (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ ఒరిజినల్ సాంగ్: జాన్ స్టీఫెన్స్ లోన్నీ లిన్ (గ్లోరీ, సెల్మా) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్లీ, ఇయాన్ హంటర్ అండ్ స్కాట్ ఫిషర్ (ఇంటర్ స్టెల్లర్) ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్: సిటిజన్ ఫోర్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: టామ్ క్రాస్ విప్లాష్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్-లైవ్ యాక్షన్: ది ఫోన్ కాల్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్-యానిమేటెడ్: ఫియస్ట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: బిగ్ హీరో 6 -
టీవీలకు అతుక్కుపోయిన బాలీవుడ్..!
ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్క బాలీవుడ్ సినీ వర్గాలు మాత్రం అందరికన్నా ముందే మేల్కొంది. బాలీవుడ్ జనాలు వేకువ జామునుంచి టీవీలకు అతుక్కుపోయారు. అందుకు ప్రధాన కారణం ఆస్కార్ అవార్డుల వేడుకే. 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరికీ అవార్డులు దక్కుతాయనే ఉత్కంఠతో నిద్రలేచి టీవీలకు ముఖాలు తగిలించేశారు. ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్లు తీసుకొని ట్విట్టర్లోకి వచ్చి 'లేండి.. మేలుకోండి.. ఆస్కార్ అవార్డుల వేడుకను వీక్షించండి. మీకు నచ్చిన వాళ్లకు అవార్డు వస్తే రెచ్చిపోయి ఈలలు వేసి గోలగోల చేయండి' అంటూ పోస్టింగ్ చేశారు. ఇలా మెలకువగా ఉన్నవారిలో కునాల్ ఖేము, ఆయన భార్య సోహా అలీ ఖాన్, సోఫీ చౌదరీ, నేహాశర్మ, మిలాప్ జవేరీ, దియా మిర్జా, దీపామెహంతాతోపాటు పలువురు ఉన్నారు. -
ఉత్తమ సహాయ నటుడు జేకే సైమన్స్
87వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును జేకే సైమన్స్ దక్కించుకున్నారు. ఆయన వయసు 60 ఏళ్లు. విప్లాష్ అనే చిత్రంలో ఉత్తమ నటనను కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది. ఇక బాయ్హుడ్ చిత్రానికిగాను...సీనియర్ నటి "పెట్రిసియా ఆర్క్వెట్" ఉత్తమ సహాయ నటి అవార్డు సొంతం చేసుకుంది. విప్లాష్, గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ చిత్రాలు సత్తా చాటాయి. చెరో మూడు ఆస్కార్లను దక్కించుకుని సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా నిలిచాయి. ఉత్తమ లుఘచిత్రంగా ది ఫోన్ కాల్ , ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పొలాండ్కి చెందిన "ఈడా"కు ఆస్కార్ వరించింది. ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో "విప్లాష్" చిత్రానికి, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో "అమెరికన్ స్నైపర్" చిత్రానికి ఆస్కార్ దక్కింది. ఇక వస్త్ర, కేశ అలంకరణ, మేకప్ విభాగాల్లో... "గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్" చిత్రం ఆస్కార్ అందుకుంది. -
నాలుగు అవార్డులు దక్కించుకున్న బర్డ్మేన్
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ చిత్రంగా బర్డ్మేన్ నిలిచింది. ఏడు చిత్రాలను వెనక్కి నెట్టి ఈ చిత్రం ముందు వరుసలో నిలదొక్కుకుంది. ఈ చిత్రం మొత్తం నాలుగు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. దర్శక విభాగంలో, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సినిమాటోఫోగ్రఫీ విభాగంలో కూడా ఈ చిత్రానికే అవార్డులు వశమయ్యాయి. ఈ చిత్రంతో పోటీ పడిన ఇతర చిత్రాలు బాయ్ హుడ్, సెల్మా, ది అమెరికన్ స్నిప్పర్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, ది ఇమిటేషన్ గేమ్, ది దియరీ ఆప్ ఎవిరీథింగ్, విప్లాష్. -
ఉత్తమ నటీ జులియానే,నటుడు ఎడ్డీ
ప్రతిష్ఠాత్మక 87వ ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ నటుడి అవార్డును ఎడ్డీ రెడ్మైనే దక్కించుకున్నారు. ఆయన నటించిన చిత్రం ది థియరీ ఆఫ్ ఈవెనింగ్. అలాగే ఉత్తమ నటి అవార్డును జులియానే మూర్ దక్కించుకుంది. స్టిల్ అలిస్ అనే చిత్రంలో ఆమె పోషించిన అద్భుత పాత్రకుగాను ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో కలిపి జులియానే మూర్ ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ఇది ఐదోసారి. గతంలో రెండు చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు దక్కించుకోగా మరో రెండు చిత్రాలకు సహాయనటిగా ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఇక ఉత్తమ దర్శకత్వ విభాగంలో 87వ ఆస్కార్ అవార్డును అలెజాండ్రో జీ ఇనారిట్టు దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం బర్డ్ మాన్. ఈ అవార్డుతో కలిపి మొత్తం ఐదు నాలుగు అవార్డులను బర్డ్మెన్ దక్కించుకుంది. -
ఇంటర్ స్టెల్లర్ కు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్
87వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును ' ఇంటర్ స్టెల్లర్' అనే చిత్రం దక్కించుకుంది. ఈ చిత్రంతో క్యాప్పటన్ అమెరికా దివింటర్ సోల్జర్, డాన్ ఆప్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ఎక్స్ మెన్ డేస్ ఆఫ్ ది ఫ్యూచర్ పాస్ట్ పోటీపడ్డాయి. ఇంటర్ స్టెల్లర్ చిత్రానికి క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించారు. అలాగే యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డును 'బిగ్ హీరో 6' దక్కించుకుంది. ఇక ఉత్తమ సినిమాటోఫోగ్రఫీ చిత్రంగా 'బర్డ్మాన్' నిలిచింది. ఈ అవార్డును ఆడం స్టాక్ హౌసెన్, అన్నా పిన్నాక్ అందుకున్నారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖ హాలీవుడ్ నటులు, ఇతర ముఖ్యులకు నివాళులర్పించారు. ముఖ్యంగా హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్తోపాటు ఇతరులను గుర్తు చేసుకున్నారు.