ఉత్తమ నటీ జులియానే,నటుడు ఎడ్డీ | best actor, actress awards to Eddie Redmayne, Julianne Moore | Sakshi
Sakshi News home page

ఉత్తమ నటీ జులియానే,నటుడు ఎడ్డీ

Published Mon, Feb 23 2015 10:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

best actor, actress awards to Eddie Redmayne, Julianne Moore

ప్రతిష్ఠాత్మక 87వ ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ నటుడి అవార్డును ఎడ్డీ రెడ్మైనే దక్కించుకున్నారు. ఆయన నటించిన చిత్రం ది థియరీ ఆఫ్ ఈవెనింగ్. అలాగే ఉత్తమ నటి అవార్డును జులియానే మూర్ దక్కించుకుంది. స్టిల్ అలిస్ అనే చిత్రంలో ఆమె పోషించిన అద్భుత పాత్రకుగాను ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో కలిపి జులియానే మూర్  ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం ఇది ఐదోసారి.

 

గతంలో రెండు చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు దక్కించుకోగా మరో రెండు చిత్రాలకు సహాయనటిగా ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. ఇక ఉత్తమ దర్శకత్వ విభాగంలో 87వ ఆస్కార్ అవార్డును అలెజాండ్రో జీ ఇనారిట్టు దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం బర్డ్ మాన్. ఈ అవార్డుతో కలిపి మొత్తం ఐదు నాలుగు అవార్డులను బర్డ్మెన్ దక్కించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement