టీవీలకు అతుక్కుపోయిన బాలీవుడ్..! | Bollywood Town hooked to TV sets | Sakshi
Sakshi News home page

టీవీలకు అతుక్కుపోయిన బాలీవుడ్..!

Published Mon, Feb 23 2015 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Bollywood Town hooked to TV sets

ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్క బాలీవుడ్ సినీ వర్గాలు మాత్రం అందరికన్నా ముందే మేల్కొంది. బాలీవుడ్ జనాలు వేకువ జామునుంచి టీవీలకు అతుక్కుపోయారు. అందుకు ప్రధాన కారణం ఆస్కార్ అవార్డుల వేడుకే. 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎవరెవరికీ అవార్డులు దక్కుతాయనే ఉత్కంఠతో నిద్రలేచి టీవీలకు ముఖాలు తగిలించేశారు.

 

ప్రతి ఒక్కరూ చేతిలో ఫోన్లు తీసుకొని ట్విట్టర్లోకి వచ్చి 'లేండి.. మేలుకోండి.. ఆస్కార్ అవార్డుల వేడుకను వీక్షించండి. మీకు నచ్చిన వాళ్లకు అవార్డు వస్తే రెచ్చిపోయి ఈలలు వేసి గోలగోల చేయండి' అంటూ పోస్టింగ్ చేశారు. ఇలా మెలకువగా ఉన్నవారిలో కునాల్ ఖేము, ఆయన భార్య సోహా అలీ ఖాన్, సోఫీ చౌదరీ, నేహాశర్మ, మిలాప్ జవేరీ, దియా మిర్జా, దీపామెహంతాతోపాటు పలువురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement