87వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును జేకే సైమన్స్ దక్కించుకున్నారు. ఆయన వయసు 60 ఏళ్లు. విప్లాష్ అనే చిత్రంలో ఉత్తమ నటనను కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది. ఇక బాయ్‌హుడ్ చిత్రానికిగాను...సీనియర్ నటి "పెట్రిసియా ఆర్క్వెట్" ఉత్తమ సహాయ నటి అవార్డు సొంతం చేసుకుంది. విప్లాష్, గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ చిత్రాలు సత్తా చాటాయి. చెరో మూడు ఆస్కార్లను దక్కించుకుని సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఉత్తమ లుఘచిత్రంగా ది ఫోన్ కాల్ , ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా పొలాండ్‌కి చెందిన "ఈడా"కు ఆస్కార్ వరించింది. ఉత్తమ సౌండ్ మిక్సింగ్ విభాగంలో "విప్‌లాష్" చిత్రానికి, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో "అమెరికన్ స్నైపర్" చిత్రానికి ఆస్కార్ దక్కింది. ఇక వస్త్ర, కేశ అలంకరణ, మేకప్ విభాగాల్లో... "గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్" చిత్రం ఆస్కార్ అందుకుంది.