వాషింగ్టన్: ఆధునిక యుగంలో కట్, కాపీ, పేస్ట్ కీలు లేకుండా కంప్యూటర్ ఆధారిత కార్యకలాపాలను చేయలేము. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను కనుగొనలేమన్న విషయం తెలిసిందే. అటువంటి కట్, కాపీ, పేస్ట్ కీలను కనుగొని ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ (74) మృతి చెందారు. టెస్లర్ 1945వ సంవత్సరం అమెరికాలో జన్మించారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. టెస్లర్ ఆపిల్, అమెజాన్, యాహూ, జిరాక్స్ సంస్థలల్లో పనిచేశారు.
1970 జిరాక్స్ పాలో ఆల్టో పరిశోధన కేంద్రంలో ఆయన పని చేసస్తున్న సమయంలో కట్, కాపీ, పేస్ట్ కీలు ఆవిష్కరించడానికి ఆలోచన వచ్చింది. ఆయన ఆపిల్ సంస్థలో లీసా, మాకింతోష్‌తో కలిసి ఇంటఫేస్ రూపకల్పనపై పనిచేశారు. దీంతో ఆయన ఆపిల్‌నెట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. టెస్లర్ అమెజాన్‌లో చేరే ముందు అతను స్టేజ్‌కాస్ట్ సాఫ్ట్‌వేర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. ఇది విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పించే సంస్థ. ఆయన యాహూలో యూజర్స్ ఎక్సిపీరియన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. తన మరణానికి ముందు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్ సంస్థలో పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment