cut and paste
-
కట్, కాపీ, పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్ మృతి
వాషింగ్టన్: ఆధునిక యుగంలో కట్, కాపీ, పేస్ట్ కీలు లేకుండా కంప్యూటర్ ఆధారిత కార్యకలాపాలను చేయలేము. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలను కనుగొనలేమన్న విషయం తెలిసిందే. అటువంటి కట్, కాపీ, పేస్ట్ కీలను కనుగొని ప్రపంచానికి అందించిన శాస్త్రవేత్త లారీ టెస్లర్ (74) మృతి చెందారు. టెస్లర్ 1945వ సంవత్సరం అమెరికాలో జన్మించారు. ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. టెస్లర్ ఆపిల్, అమెజాన్, యాహూ, జిరాక్స్ సంస్థలల్లో పనిచేశారు. 1970 జిరాక్స్ పాలో ఆల్టో పరిశోధన కేంద్రంలో ఆయన పని చేసస్తున్న సమయంలో కట్, కాపీ, పేస్ట్ కీలు ఆవిష్కరించడానికి ఆలోచన వచ్చింది. ఆయన ఆపిల్ సంస్థలో లీసా, మాకింతోష్‌తో కలిసి ఇంటఫేస్ రూపకల్పనపై పనిచేశారు. దీంతో ఆయన ఆపిల్‌నెట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. టెస్లర్ అమెజాన్‌లో చేరే ముందు అతను స్టేజ్‌కాస్ట్ సాఫ్ట్వేర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. ఇది విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పించే సంస్థ. ఆయన యాహూలో యూజర్స్ ఎక్సిపీరియన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు. తన మరణానికి ముందు శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్ సంస్థలో పని చేశారు. -
కట్ అండ్ పేస్ట్
మెడిక్షనరీ ఎక్కువగా మీడియాలో ఉపయోగించే పదబంధం ఇది. కంప్యూటర్లు వచ్చాక బాగా ప్రాచుర్యం పొందింది. సొంత కథనమేదీ రాయకుండా ఎక్కడిదో సమాచారాన్ని యథాతథంగా ఎత్తేసి, కావలసిన చోట అతికించేసే ప్రక్రియను ఇలా అంటారు. వైద్య పరిభాషలోనూ ‘కట్ అండ్ పేస్ట్’ అనే పదబంధాన్ని వాడుతుంటారు. అయితే, వేరే అర్థంలో వాడుతుంటార్లెండి. మిడిమిడి జ్ఞానం గల సర్జన్లు రోగికి ఏమైందో సరిగా తెలుసుకోకుండానే అర్జంట్‌గా ఆపరేషన్ చేసేస్తుంటారు. ఇలాంటి ఆపరేషన్లలో కోత కోసిన తర్వాత రోగికి చేయాల్సిందేమీ లేదని తాపీగా తెలుసుకున్నాక, గుట్టుచప్పుడు కాకుండా కోసినంత మేరా కుట్టేసి, ఆ తర్వాత కోత గాయం తగ్గడానికి మందులు మాకులు ఇస్తారు. ఇలాంటి అనవసరపు ఆపరేషన్లనే ‘కట్ అండ్ పేస్ట్’ అంటారు. -
ట్విట్టర్లో ‘కట్ అండ్ పేస్ట్’గాళ్ల భరతం!
న్యూఢిల్లీ: సామాజిక వెబ్సైట్లలో, ముఖ్యంగా ట్విట్టర్లో కేకుల్లా కటవుతున్న జోకులను చూసి కడుపుబ్బ నవ్వుతున్న వాళ్లు, వాటిని తిరిగి ఇతరులకు షేర్ చేస్తున్న వాళ్లు నేడు కోకొల్లలు. ఆ జోకులు పేల్చింది ఎవరో, వారి పేరు కూడా కనీసం ప్రస్తావించకుండా, వాటిని తామే సృష్టించామనే భ్రమ కలిగేలా ఫోజులిచ్చేవాళ్లూ కోకొల్లలే. జోకుల కాపీరైట్ గలవారి గోలను తట్టుకోలేక చివరకు ‘ట్విట్టర్’ చర్యలకు ఉపక్రమించింది. కట్ అండ్ పేస్ట్గాళ్ల భరతం పట్టేందుకు సిద్ధమైంది. కాపీరైటర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే బోలెడు జోకుల్ని ‘విత్ హెల్డ్’ పేరిట బ్లాక్ చేసింది. దాంతో కాపీరైటర్లు, కమేడియన్లు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్న ఓల్గా లెక్సెల్ సీరియస్‌గా ఇచ్చిన ఫిర్యాదుతో ట్టిట్టర్ యాజమాన్యంలో కదలిక వచ్చింది. తర్వాత మరెంతో మంది కాపీరైటర్లు ఆమె లాగానే ఫిర్యాదులు చేశారు. కాపీరైటర్లు మరింత ముందుకు వచ్చి ట్విట్టర్లో వచ్చిన తమ జోకుల గురించి ఫిర్యాదు చేయాలని, ఆ జోకులు తమవేనంటూ నిరూపించే డాక్యుమెంట్లుగానీ, వీడియో క్లిప్పింగులుగానీ ఫిర్యాదుతోపాటు పేర్కొనాలని ట్విట్టర్ యాజమాన్యం సూచించింది. ప్రస్తుతం కాపీరైట్గల జోకులను ఇతరులెవరైనా కట్ అండ్ పేస్ట్ చేస్తే వాటిని ప్రస్తుతానికి ‘వితెల్డ్’ చేస్తున్నామని, ఈ ట్రెండ్‌ను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో కట్ అండ్ పేస్ట్గాళ్ల భరతం పట్టేందుకు కాపీరైట్ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటామని ట్టిట్టర్ యాజమాన్యం హెచ్చరించింది.