
ప్రతీకాత్మక చిత్రం
ఇరాన్‌లో కోవిడ్-19 (కరోనా వైరస్) బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా బుధవారం ఒక్క రోజే మరో 63 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో తమ దేశంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 354 కు చేరిందని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. దురదృష్టవశాత్తు గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 63 కొత్త మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కియానౌష్ జహాన్పూర్ వెల్లడించారు. అలాగే దేశంలో 958 కొత్తగా కోవిడ్ -19 కేసులను గుర్తించామని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుందన్నారు.
చదవండి : కరోనా : మహిళ పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment