
టెహ్రన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్ ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్ సహకారాన్ని అభ్యర్ధించింది. డ్రోన్ దాడిలో ఇరాన్ సైనికాధికారిని చంపినందుకు ట్రంప్‌తో పాటు పదుల సంఖ్యలో ఇతరులను నిర్బంధంలోకి తీసుకుంటామని ఇరాన్ ప్రకటించిందని ఓ స్ధానిక ప్రాసిక్యూటర్ సోమవారం వెల్లడించినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్ చర్యతో ట్రంప్‌నకు అరెస్ట్ ప్రమాదం ముంచుకురాకున్నా ఇరాన్, అమెరికాల మధ్య ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
కాగా, బాగ్దాద్‌లో ఈ ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన ఘటనలో ట్రంప్‌తో పాటు 30 మందికి పైగా ఇతరులపై హత్య, ఉగ్రవాద అభియోగాలున్నాయని ప్రాసిక్యూటర్ అలీ అల్ఖాసిమెర్ పేర్కొన్నట్టు ఐఎస్‌ఎన్‌ఏ వార్తాసంస్థ వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ఆయన ప్రాసిక్యూషన్‌ను ఇరాన్ కొనసాగిస్తుందని ఆయన పేర్కొంది. కాగా ఈ ఉదంతంపై ఇంటర్‌పోల్ వర్గాల నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. చదవండి : విగ్రహాల ధ్వంసం : ట్రంప్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment