టెహ్రాన్: ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. విమానంలో సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించిందని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ విమానం బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోగా అందులోని మొత్తం 176 మంది మరణించడం తెల్సిందే. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడుల సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
‘పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న ఆ విమానం 8 వేల అడుగుల ఎత్తులో ఉండగా రాడార్ నుంచి అదృశ్యమైంది. ఏదో లోపం తలెత్తినట్లు గుర్తించిన వెంటనే వెనక్కి రావడానికి గాను విమానం కుడి వైపునకు తిరిగి, ఆ వెంటనే కూలిపోయినట్లుగా గుర్తించాం. అయితే, విమానంలో తలెత్తిన అసాధారణ పరిస్థితులపై పైలెట్ ఎలాంటి రేడియో మెసేజ్ పంపించలేదు’ అని ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఇరాన్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తుతోపాటు, బ్లాక్‌బాక్స్‌లో సమాచారాన్ని విశ్లేషించేందుకు 45 మందితో కూడిన ఉక్రెయిన్ అధికారుల బృందం గురువారం ఇరాన్‌కు చేరుకుంది. ప్రమాద ఘటనపై ఏడు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, ప్రస్తుతానిౖMðతే ఫలానా కారణమని చెప్పలేమని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment