వియెన్నా: ఆస్ట్రియాలో మెర్కెన్ జీ అనే 14 ఏళ్ల బాలుడిపై ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి.
వియెన్నా: ఆస్ట్రియాలో మెర్కెన్ జీ అనే 14 ఏళ్ల బాలుడిపై ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ద్వారా అతడు ప్రేరేపితమై పలు హింసాత్మక దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు ఈ విషయం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పరిశీలించిన సెయింట్ పాలిటన్ సిటీ ప్రాసీక్యూటర్ కార్యాలయం అతడి నేరాన్ని గుర్తించింది.
బాంబుల తయారీ, వాటిని పేల్చే విధానం వంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేయడమే కాకుండా స్వయంగా డిటోనేటర్ రూపొందించి దానిని వియెన్నాలోని వెస్ట్ బానఫ్ రైల్వే స్టేషన్లో పెట్టి పేల్చి వేయాలని కూడా ప్లాన్ చేశాడట. అంతేకాకుండా, అతడి ల్యాప్ టాప్లో మొత్తం ఐఎస్ చేసే హింసాత్మక చర్యల వీడియోలు, వారి మాటల రికార్డులు, ఆకృత్యాల ఫొటోలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు.