వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, సలహాదారు ఇవాంకా ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలికి కరోనా(కోవిడ్-19) పాజిటివ్‌గా తేలింది. దీంతో శ్వేతసౌధంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా బాధితురాలు గత కొన్ని వారాలుగా ఇవాంకాకు దూరంగానే ఉన్నారని.. కాబట్టి ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్‌కు శుక్రవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగటివ్ ఫలితం వచ్చిందని వెల్లడించాయి. (ట్రంప్‌కి రోజూ కోవిడ్ పరీక్షలు)
ఈ విషయం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘కేటీ అద్భుతమైన వ్యక్తి. ఆమెలో కరోనా లక్షణాలు బయటపడలేదు. అయినప్పటికీ తరచూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆమెకు ప్రాణాంతక వైరస్ సోకినట్లు తేలింది’’ అని పేర్కొన్నారు. కాగా ట్రంప్ వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన శ్వేతసౌధ వర్గాలు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నెగెటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి తాను ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment