
టోక్యో : ఓ భారీ కుంభకోణం (క్రోనిజం స్కాం) నుంచి జపాన్ ప్రధాని షింజో అబే భార్య అకీ అబేని తప్పించారు. ప్రధాని, ఆయన కింద ఉండే ఆర్థికశాఖ ఒత్తిడి మేరకు ఆయన భార్యను కుంభకోణానికి పాల్పడిన వ్యక్తుల జాబితాలో లేకుండా తొలగించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రధాని స్థాయి వ్యక్తి కాబట్టే తన భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తప్పించారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి చెందిన భూమిని మోరిటోమో గాకువెన్ ఓ విద్యాసంస్థ యజమానికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌కు కట్టబెట్టారంట.
ఆ స్కూల్ యజమానితో అబే భార్య అకీ ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, అదొక పెద్ద కుంభకోణం అంటూ దానికి పాల్పడిన వ్యక్తుల జాబితాను రూపొందించారు. తొలుత అందులో అబే భార్య పేరు ఉన్నప్పటికీ తాజాగా విచారణ బృందం చేతికి వెళ్లే సమయంలో ఆమె పేరును మాయం చేశారు. దీనిపై అబే కూడా స్పందిస్తూ తనకు గానీ, తన భార్యకు గానీ ఆ స్కూల్ యజమానికి సంబంధం లేదని, ఒక వేళ నిజంగానే సంబంధాలు ఉన్నట్లు గుర్తిస్తే కచ్చితంగా తాను రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గాకువెన్ ఆయన భార్యను గత (2017)లోనే పోలీసులు అరెస్టు చేశారు. అధిక మొత్తంలో సబ్సిడీలు పొందిన ఆరోపణల కిందట వీరిని అరెస్టు చేసి విచారించగా అందులో అబే భార్యకు కూడా భాగం ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment