ఈ బుడతడు అదృష్టవంతుడే!
ఇశ్చియా: ఇటలీని భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. భూ ప్రకంపనల ధాటికి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇశ్చియా దీవిలోని భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా దాదాపు 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే భవన శిథిలాల నుంచి ముగ్గురు చిన్నారులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. వారిలో ఏడు నెలల పసికందు కూడా ఉండడం విశేషం.
దాదాపు 14 గంటలపాటు భారీ శిథిలాల కిందే చిక్కుకున్న పాస్క్వేల్‌ను సురక్షితంగా బయటకు తీసినట్లు స్థానిక అగ్నిమాపకశాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఏమాత్రం గాయాలు కాని చిన్నారి ఫొటోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజనులంతా ఈ బడుతడు అదృష్టవంతుడేనంటూ కామెంట్లు పెడుతున్నారు.