ఔను! ఆ చిన్నారి బతికింది! | girl was pulled from the rubble after spending 17 hours | Sakshi
Sakshi News home page

ఔను! ఆ చిన్నారి బతికింది!

Published Thu, Aug 25 2016 5:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ఔను! ఆ చిన్నారి బతికింది!

ఔను! ఆ చిన్నారి బతికింది!

ఓ భారీ భవనం నేలమట్టమైంది. శిథిలాల గుట్టగా మారిపోయింది. ఆ భవనం మట్టిదిబ్బగా మారిపోయి 17 గంటలు గడిచినా ఎక్కడో చిన్నశబ్దం వినిపించింది. ఎవరూ ఒకరు బతికి ఉన్నారన్న చిన్న ఆశ రేపింది. వెంటనే సహాయక సిబ్బంది చేతులతో మట్టిపెళ్లలు తొలగిస్తూ పోయారు. ఒక్కొక్క మట్టిపెళ్లను తీస్తూవచ్చిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఓ పదేళ్ల బాలిక నాటకీయరీతిలో బతికి బయటపడింది. ఆమెను చూడగానే సహాయక సిబ్బందిలో చిన్న ఆనందం. అందుకే 'ఆమె బతికింది' అంటూ గట్టిగా కేకలు వేశారు.

భారీ భూకంపంతో విషాదఛాయలు అలుముకున్న ఇటలీలో ఈ నాటకీయ ఘటన జరిగింది. భూకంపంలో నేలమట్టమైన ఓ భవనం శిథిలాల కింద 17 గంటలపాటు చిక్కుకుపోయిన పదేళ్ల బాలిక ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. శిథిలాల కింద శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మట్టిపెళ్లలను తొలగించి.. శిథిలాల్లో చిక్కుకున్న బాలికను కాపాడారు. దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ఈ చిన్నారి సురక్షితంగా బయటపడటంతో సహాయక సిబ్బందిలో ఆనందం వ్యక్తమైంది. వారు చప్పట్లు కొడుతూ ఆ బాలికకు స్వాగతం పలికారు.

సెంట్రల్‌ ఇటలీలో బుధవారం తెల్లవారు జామున సంభవించిన భారీ భూకంపంలో 247మంది చనిపోయారు. వందలమంది గాయపడ్డారు. ఇంకా ఎంతోమంది గల్లంతయ్యారు. ఇంతటి విషాదంలో 17గంటలు శిథిలాల్లో చిక్కుకొని మృత్యువుతో పోరాడుతున్న ఓ పదేళ్ల బాలిక సురక్షితంగా బయటపడటం కొంత ఆనందాన్ని నింపింది. విషాదంలోనూ కొంత సంతోషాన్ని పంచింది. భూకంపం విలయంతో దిగ్భ్రాంతికి గురైఏన ఆ బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్యం బాగుందని సహాయక సిబ్బంది తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement