
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాది ఐదేళ్లలో తొలిసారిగా ఒక వీడియోలో కన్పించాడు. ఐఎస్ సంస్థ సోమవారం ఒక ప్రచార వీడియో విడుదల చేసింది. ఈ వీడియోను ఎప్పుడు తీశారో తెలియలేదు. కానీ తూర్పు సిరియాలోని ఐఎస్ స్థావరం బాగౌజ్ కోసం నెలల తరబడి కొనసాగించిన పోరాటం గురించి బాగ్దాది ప్రస్తావించారు.
‘బాగౌజ్ కోసం పోరాటం ముగిసింది’ అని బాగ్దాది తన ఎదురుగా ఉన్న వారితో అన్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. పేలుళ్లకు పాల్పడిన వారిని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment