
మాస్కో : సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కథ దాదాపు ముగిసినట్టేనని రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. సిరియాలో కేవలం 8 శాతం భూభాగం మాత్రమే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలో ఉందని.. దీనిని కూడా కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటామని రష్యన్ మిలటరీ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులపై సైన్యం విజయం సాధిస్తోందని.. సిరియాలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సెర్గీ రుడోస్కీ తెలిపారు. రష్యా వైమానిక దళం క్రమం తప్పకుండా ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment