ఉగ్రదాడుల్లో 16 మంది మృతి | 16 dead in three blasts in northeast Syria | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడుల్లో 16 మంది మృతి

Published Thu, Dec 31 2015 8:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

16 dead in three blasts in northeast Syria

క్వామిష్లీ: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస బాంబుదాడులతో చెలరేగారు. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియా ఈశాన్య ప్రాంతంలోని క్వామిష్లీ పట్టణంలోని మూడు రెస్టారెంట్లు లక్ష్యంగా దాడులు జరిగాయి. రెస్టారెంట్ లోపల జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఘటనకు బాధ్యులం తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఇరాక్, టర్కీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న క్వామిష్లీ పట్టణం భద్రతా బలగాల ఆదీనంలో ఉంది. అయితే ఇక్కడ స్వయం పాలనను ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తరచు దాడులకు పాల్పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement