మెషిన్గన్లతో మహిళల గస్తీ | Lebanese Christian women armed with machine guns patrol their border village | Sakshi
Sakshi News home page

మెషిన్గన్లతో మహిళల గస్తీ

Published Wed, Jun 29 2016 10:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

మెషిన్గన్లతో మహిళల గస్తీ

మెషిన్గన్లతో మహిళల గస్తీ

లెబనాన్: లెబనాన్లోని ఖా అనే గ్రామంలో ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు చేత బట్టారు. వారికి అనుభవం లేకున్నా తలా ఓ గన్ పట్టుకొని గస్తీ కాస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా తమ తుపాకీ ఎక్కుపెడుతున్నారు. అందుకు కారణం సోమవారం ఆ గ్రామంపై ఉగ్రవాదులు విరుచుకుపడటమే. ఖా అనే గ్రామం సిరియా సరిహద్దుకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంది. ఆ గ్రామం మొత్తం క్రిస్టియన్ జనాభాతో నిండి ఉంటుంది.

సోమవారం అనుమానిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తొమ్మిది దాడులకు పాల్పడ్డారు. అందులో ఎనిమిది ఆత్మాహుతి దాడులే. ఇందులో ఐదుగురు చనిపోగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఓ పక్క లెబనాన్ మిలటరీ మొత్తం ఆ గ్రామంలో దిగినప్పటికీ తాము కూడా సిద్ధం అంటూ అక్కడి క్రిస్టియన్ మహిళలు మెషిన్ గన్లు పెట్టారు. ఆగ్రామం చుట్టుముట్టి అందులోకి అక్రమంగా చొరబడిన 103మంది సిరియాకు చెందిన శరణార్ధులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement