‘లవ్ హార్మోన్’తో ఆధ్యాత్మికత!
వాషింగ్టన్: ‘లవ్ హార్మోన్’ ఆక్సిటోసిన్ మగవారిలో సామాజిక బంధంతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కూడా పెంచుతుందని తేలింది. కొందరికి ఆక్సిటోసిన్ హార్మోన్ ఇచ్చిన వారం రోజుల్లో వారిలో ఆధ్యాత్మికత గణనీయంగా పెరిగిందని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో స్పష్టమైంది. ముఖ్యంగా ధ్యానం చేసే సమయంలో ఇలాంటి భావాలు వారిలో ఎక్కువగా కనిపించాయని పాటీ వాన్ కాపెల్లెన్ అనే సోషల్ సైకాలజిస్ట్ వివరించారు. ఆధ్యాత్మికత, ధ్యానం రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉందని ఇప్పటికే తెలిసిందని, దీనికి సంబంధించిన జీవ ప్రక్రియలు తెలుసుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు.