
వుహాన్ : కుక్కలను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అలాంటి సంఘటనే మరోకటి చైనాలోని వుహాన్‌లో చోటుచేసుకుంది. తన యజమాని ఆత్మహత్య చేసుకున్నచోటే కుక్క రోజుల తరబడి ఎదురుచూస్తోంది. తన పెంపుడు కుక్క ఎదుటే మే 30న వుహాన్‌లోని యాంగ్జీ వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి తన యజమాని తిరిగొస్తాడని శునకం అక్కడే ఎదురు చూస్తోంది. ఈ కుక్కని గమనించిన క్సూ అనే వ్యక్తి పెంచుకోవాలని తనతోపాటూ తీసుకెళ్లినా అది తప్పించుకుపోయింది. తన యజమాని కోసం శునకం ఎదురు చూస్తుండగా క్సూ తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘మనిషి జీవితం చాలా విలువైంది. మీ కోసం జీవిత కాలం ఎదురు చూసే వారుంటారు. దయ చేసి ఆత్మహత్య చేసుకోకండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (సరిహద్దు వివాదం.. కేంద్రం వర్సెస్ రాహుల్ గాంధీ)
అయితే కొద్ది రోజుల క్రితమే వుహాన్‌లోనే ఓ వ్యక్తి కరోనా వ్యాధితో మృతిచెందగా, బేవో అనే శునకం తన యజమాని ఇంకా తిరిగి రాడు అని తెలియక మూడు నెలలుగా ఆసుపత్రిలోనే నిరీక్షించింది. ఈ ఘటన అందరి హృదయాలను కదిలించిన విషయం తెలిసిందే.(కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు)
Comments
Please login to add a commentAdd a comment