సీటు వెనక్కి నెట్టిందని.. | Man Chokes Woman on Southwest Airlines Jet for Reclining Her Seat, Witnesses Say | Sakshi
Sakshi News home page

సీటు వెనక్కి నెట్టిందని..

Published Tue, Oct 20 2015 1:50 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

సీటు  వెనక్కి  నెట్టిందని.. - Sakshi

సీటు వెనక్కి నెట్టిందని..

లాస్ ఏంజెల్స్ :  స్వల్ప  వివాదం కారణంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన  సౌత్ వెస్ట్ ఎయిర్వేస్ జెట్ విమానం అత్యవసరంగా  ల్యాండ్ అయింది.  కేవలం తన సీటును వెనక్కి నెట్టిన కారణంగా  ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల  తోటి ప్రయాణికుడు  దురుసుగా ప్రవర్తించాడు.  దీంతో విమానంలో ఉన్న 136 మంది ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు.  ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ  కారణంగా పైలట్  విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

స్వల్ప విషయానికే అసహనానికి గురైన అతగాడు.. ప్రయాణికురాలి గొంతు పట్టుకుని నులిమేశాడు. ఆమెను  ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా  చేసి తలపై తీవ్రంగా కొట్టాడు.  దీన్ని గమనించిన తోటి  ప్రయాణీకులు అప్రమత్తమై అతడిని వారించి, సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  దీంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.

విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత బాధిత  మహిళ రిలాక్స్గా  తన సీటును వెనక్కి జరిపిందని... అయితే ఆమె వెనక సీటులో కూర్చున్న ప్రయాణికుడు ..ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...అకస్మాత్తుగా ఆమె గొంతుపట్టుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆమె భయంతో బిక్కచచ్కిపోయిందన్నారు.  ఈ వివాదంతో సుమారు అయిదుగంటల పాటు విమానం ఆగిపోయింది. దీంతో మిగతా వారిని వేరే విమానంలో శాన్ ఫ్రాన్సిస్కోకు తరలించారు.  కాగా  ఈ ఆలస్యం విలువ సుమారు  రెండు లక్షల డాలర్లని  ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్  తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement