ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు! | man strips his pants as phone burnt in the pocker | Sakshi
Sakshi News home page

ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు!

Published Mon, Jun 6 2016 7:20 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు! - Sakshi

ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు!

రోజూలాగే అతగాడు ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకుని.. మోటార్ సైకిల్ మీదు వెళ్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి జేబు వేడెక్కినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని ఫోన్ చూసుకున్నాడు.. అప్పటికే అది బాగా వేడెక్కింది. దాంతో బయటకు తీయబోయాడు.. అప్పటికే అది కాలడం మొదలైంది. కష్టమ్మీద బయటకు తీసి, కింద పారేశాడు. కానీ ఆలోపే ఆయన చేతులు, తొడ భాగాలు కొంతవరకు కాలిపోయాయి. చైనాలోని జాంగ్ అనే యువకుడు జేబులో పెట్టుకున్న ఫోన్ ఏమీ చేయకుండానే దానంతట అదే కాలిపోయిందని చుటియాన్ మెట్రోపోలిస్ డైలీ పత్రిక తెలిపింది. దాంతో అతగాడు అప్పటికప్పుడే రోడ్డుమీద ప్యాంటు విప్పేసి దాన్ని అవతల పారేసి పరుగులు తీయడం మొదలుపెట్టాడు.

అతడు వాడుతున్నది కూడా ఆషామాషీ ఫోన్ కాదు. శామ్‌సంగ్ ఎస్ఎం-జి90089డబ్ల్యు. జాంగ్ గనక వెంటనే స్పందించి ఉండకపోతే.. మరింత పెద్ద ప్రమాదం సంభవించేదట. ఆ ఫోన్‌ను తాను 2014లో ఒక లోకల్ స్టోర్‌లో దాదాపు రూ. 41వేలు పెట్టి కొన్నానని, అందులో విడిభాగాలు కూడా కంపెనీవి తప్ప వేరేవేవీ వాడలేదని జాంగ్ చెప్పాడు. ఇప్పటివరకు ఫోన్ కూడా బాగానే ఉందని, ఉన్నట్టుండి ఎందుకు కాలిపోయిందో తెలియలేదని అన్నాడు. ఈ విషయం తెలిసిన శామ్‌సంగ్ సిబ్బంది జాంగ్‌కు కాల్ చేసి, ఆ ఫోన్ తమవద్దకు తీసుకురావాలని, దాన్ని పరీక్షిస్తామని చెప్పినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement