వాషింగ్టన్: మనుషుల్లా ఆలోచించడం యంత్రాలవల్ల సాధ్యమవుతుందా? ఒకవేళ అదే జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో చూశాం. అయితే అది సినిమా కదా.. అని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. యంత్రా లు కూడా మనుషుల్లా ఆలోచించే రోజు మరెంతో దూరంలో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వాదనకు బలం చేకూర్చేలా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ న్యూరల్ నెట్‌వర్క్ చిప్‌ను తయారుచేశారు. ఈ చిప్‌లో ఉన్న నెట్‌వర్క్ సిస్టమ్‌ను రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్‌గా పిలుస్తున్నారు.
ఎందుకంటే... ఏ సందర్భాల్లో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడనే వివరాలను సేకరించి, నిక్షిప్తం చేయడం ఈ రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్ ప్రత్యేకత. ఈ చిప్‌లను యంత్రాలకు అనుసంధానించడంవల్ల వాటికి మనుషుల్లా ఆలోచించే శక్తిసామర్థ్యాలు సమకూరుతాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా రూపొందిన రోబోలు ముందుగా నిక్షిప్తం చేసిన ప్రోగ్రామ్ ద్వారా పనిచేస్తున్నవే. ప్రత్యేక పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజా చిప్‌ల ద్వారా ఈ గందరగోళానికి తెరపడుతుందని, ఎటువంటి సందర్భాల్లో మనిషి ఏ రకంగా ఆలోచిస్తున్నాడనే విషయాన్ని రిజర్వాయర్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను విశ్లేషించి, నిర్ణయం తీసుకుంటాయని చెబుతున్నారు.
యంత్రాలు మనుషులయ్యే రోజు మరెంతో దూరంలో లేదు!
Published Sun, Dec 24 2017 9:40 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment