ఆ యువతి ఎత్తు సరికొత్త రికార్డు
దుబాయి: టర్కీకి చెందిన 17 ఏళ్ల యువతి ప్రపంచంలోకెల్లా ఎత్తయిన యువతిగా సరికొత్త రికార్డు సృష్టించింది. టర్కీలోని సఫ్రాన్‌బోలు పట్టణానికి చెందిన రుమీసా గెల్గి అనే ఈ యువతి 213.6 సెంటీ మీటర్లు (7 అడుగుల 0.09 అంగుళాలు) ఎత్తుతో గిన్నిస్ రికార్డులో చేరింది. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న గెల్గి తన తల్లిదండ్రులతో కలసి ఉంటోంది.
వారందరూ సాధారణ ఎత్తు కల వారే. గిన్నిస్ రికార్డుల్లో చేరడం తనకు ఆనందంగా ఉంద ని గెల్గి తెలిపింది. అయితే వీవర్స్ సిండ్రోమ్ అనే సమస్యవల్లే రుమీసా అసాధారణ ఎత్తు పెరిగి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎత్తయిన యువతిగా రికార్డు ఉన్న కెనడాకు చెందిన అన్నా హైనింగ్ (7 అడుగుల 11 అంగుళాలు) 1888లో మరణించింది.