ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి | Men throw acid into girls' faces 'for going to school' | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థినులపై యాసిడ్ దాడి

Jul 4 2015 5:30 PM | Updated on Aug 17 2018 2:10 PM

స్కూల్కు వెళుతున్న ముగ్గురు బాలికలపై దుండగులు శనివారం యాసిడ్తో దాడిచేశారు.

కాబూల్: స్కూల్కు వెళుతున్న ముగ్గురు బాలికలపై దుండగులు శనివారం యాసిడ్తో దాడిచేశారు. ఈ సంఘటన ఆఫ్ఘనిస్తాన్ లోని వెస్టర్న్ హెరాట్ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాలు.. ముగ్గురు విద్యార్థినులు హెరాట్ సిటీలో బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మాదిరిగానే స్కూల్కి బయలుదేరిన వీరిపై మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు యాసిడ్తో దాడిచేశారు. ఈ దాడిలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరు హెరాట్లోని నూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
స్కూల్కు వెళ్లే వారికి ఇదే మా శిక్ష అంటూ యాసిడ్ దాడి అనంతరం దుండగులు అన్నారని బాధితులు తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడ్డ వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement