
మొలక సందేశం
పెళ్లి పెటాకులై విడాకుల దాకా వచ్చినప్పుడు.. కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే విడిపోవాలా? నీవు ఇక నాకొద్దు, మనకిద్దరికీ ఇక చెల్లు.. అని సెలైంట్‌గా చెప్పలేరా? అలా చెప్పేందుకే..
పెళ్లి పెటాకులై విడాకుల దాకా వచ్చినప్పుడు.. కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే విడిపోవాలా? నీవు ఇక నాకొద్దు, మనకిద్దరికీ ఇక చెల్లు.. అని సెలైంట్‌గా చెప్పలేరా? అలా చెప్పేందుకే ఈ ‘బ్రేకప్ బీన్స్’. ఓ బీన్స్ విత్తు ఉన్న చిన్న కప్పులో నీళ్లు పోస్తే చాలు.. నాలుగైదు రోజుల్లో అది మొలకెత్తుతుంది. విత్తనాల పలుకులపై ‘ఇట్స్ ఓవర్’.. ఇకపై ‘లెట్స్ బీ ఫ్రెండ్స్’ అన్న సందేశం అవతలివారికి చేరిపోతుంది!
ఏడుపులు పెడబొబ్బల మధ్య విడిపోయే కంటే.. ఇలా కొత్తగా విడిపోవడం మేలంటూ అమెరికాకు చెందిన ‘డ్యూన్ క్రాఫ్ట్’ అనే కంపెనీ ఈ మ్యాజిక్ బీన్స్‌ను విక్రయిస్తోంది. విత్తనాలపై లేజర్ సాయంతో రాసిన ఈ అక్షరాలు అవి మొలకెత్తిన తర్వాత పలుకులపై కూడా కనిపిస్తాయి. ఐదు నుంచి పది రోజుల్లో మొలకెత్తే ఈ విత్తనాలను తోటలో నాటితే 20 అడుగుల వరకూ కూడా పెరుగుతాయట. ధరెంతంటే.. రెండు విత్తనాలు, కప్పు, మట్టితో కూడిన ఒక కిట్‌కు రూ. 300.