మీసాలు, గడ్డాలు మీకేనా..?
గడ్డాలు, మీసాలు మగవారికే సొంతమా.. ఏ మాకేం తక్కువ.. అనుకున్నారో ఏమో ఈ అతివలు! అందుకే అప్పటికప్పుడే వారికి నచ్చిన డిజైన్లలో గడ్డాలు, మీసాలు తెగ పెంచేశారు! అమ్మాయిలేంటీ.. గడ్డాలు పెంచడమేంటనుకుంటున్నారా.. అదేం లేదండీ.. ఇప్పుడు అమ్మాయిల్లో ఇదో క్రేజ్. జుట్టు మొత్తాన్ని ముందుకు అనుకుని గడ్డం, మీసం మాదిరిగా అల్లుకుని ఇన్‌స్టాగ్రాం, ట్వీటర్ వంటి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి హల్‌చల్ చేస్తున్నారు ఈ భామలు.