కోల్కతా: తన సోదరుడిని వెళ్లిపొమ్మని ఉగ్రవాదులు చెప్పినా స్నేహితులను రక్షించుకునేందుకు వారితోనే ఉండి ప్రాణాలుకోల్పోయాడని ఢాకా ఉగ్రదాడిలో చనిపోయిన ఫరాజ్ సోదరుడు జరేఫ్ హుస్సేన్ తెలిపాడు. సమ్మర్ హాలీడేస్ కోసం ఢాకా వచ్చిన అతడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడని చెప్పి కంటతడి పెట్టాడు. ఢాకా ఉగ్రదాడిలో మొత్తం 20 మంది ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో ఫరాజ్ అనే యువకుడు కూడా ఉన్నాడు.
శుక్రవారం సాయంత్రం తమ మిత్రుడిని కలుసుకునేందుకు ఫరాజ్, తారుషి జైన్, అబింత కబీర్ కలిసి ఢాకాలోని హోలి ఆర్టిసన్ రెస్టారెంటుకు వెళ్లారు. అక్కడికి తమ మిత్రుడు మిరాజ్ అల్ హక్ ని రమ్మని చెప్పారు. మిరాజ్ లోపలికి వచ్చే సమయం కంటే ముందే ఉగ్రవాదులు ఆ రెస్టారెంటులోకి చొరబడి నరమేధం సృష్టించారు. ఈ సమయంలో ఖురాన్ చదివిన వారిని విడిచిపెడతామని ఉగ్రవాదులు హెచ్చరించారు. అయితే, ఆ విషయం తమ సోదరుడికి కష్టమైన పనేం కాదని, ఉగ్రవాదులు అతడిని వెళ్లిపొమ్మని చెప్పి ఉంటారని, అయితే, స్నేహితులకోసం అలా ఉండిపోయి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని తెలిపాడు.
’స్నేహం కోసం మా సోదరుడు ప్రాణం విడిచాడు’
Published Mon, Jul 4 2016 2:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement