
తలదించుకునేలా ప్రవర్తించను: మోడీ
న్యూయార్క్: ఐటీ రంగంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్లో ప్రసంగించారు. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి మోడీకి ఘనస్వాగతం పలికారు.
ప్రవాస భారతీయులకు మోడీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్ఆర్ఐలు విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచారని ప్రశంసించారు. భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో గెలవడమంటే కుర్చీలో కూర్చోవడం కాదని, బాధ్యత స్వీకరించడమని పేర్కొన్నారు. తలదించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించని, తమ బాధ్యతలు ఎప్పటికీ మరవబోమని మోడీ స్పష్టం చేశారు. 30 ఏళ్ల తర్వాత భారత్లోసంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిందని మోడీ అన్నారు. ప్రజల ఆంక్షలు, ఆకాంక్షలను తప్పక నెరవేరుస్తామని మోడీ చెప్పారు.