ఉగ్రవాద నిర్మూలనకు ఐకమత్యంతో పనిచేయాలి: మోదీ
బ్రిస్బేన్: ప్రపంచ దేశాలు ఐకమత్యంతో ముందుకు సాగితేనే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం బ్రిస్బేన్లో జీ 20 సదస్సు ఆరంభానికి ముందు మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండెతో సమావేశమయ్యారు.
భారత్, ఫ్రాన్స్లు ఆర్థిక రంగంలో పరస్పరం సహకరించుకోవాలని మోదీ, హోలండె నిర్ణయించారు. మోదీని వచ్చే ఏడాది ఫ్రాన్స్కు రావాల్సిందిగా హోలండె ఆహ్వానించారు.