
లండన్: కరోనాలోని డీ614జీ స్టెయిన్ సులువుగా మనుషుల్లోకి ప్రవేశిస్తుందని అమెరికాకు చెందిన లాస్ ఆలమస్ నేషనల్ లేబొరేటరీ నిపుణులు కనుగొన్నారు. ఏప్రిల్ నుంచి కనిపిస్తోన్న ఈ ప్రత్యేక వైరస్ రకానికి ఉన్న కొమ్ముల (స్పైక్స్) ద్వారా మనుషుల కణాల్లోకి చొచ్చుకు పోతుందని తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో కనిపిస్తోందని చెప్పారు. కరోనాలోని ఇతర రకాల స్టెయిన్‌లతో పోలిస్తే డీ614జీ రకం చాలా వేగంగా విస్తరిస్తోందని, ఇది ప్రమాదకరమైందని చెప్పారు. శ్వాసకోస వ్యవస్థపై భాగంలో ఈ వైరస్ మనుగడ సాగిస్తోందని, అందువల్ల వ్యాప్తిలో మరింత ప్రమాదకరంగా మారుతోందని చెప్పారు. డీ614జీ వైరస్ జీనోమ్ పరివర్తన (మ్యూటేషన్) చెందిందని, ఇది ప్రవేశించిన చోటల్లా తనకనుగుణంగా పరివర్తన చెందుతోందని తెలిపారు. (మూడు నెలలు ముప్పుతిప్పలే!)
Comments
Please login to add a commentAdd a comment