అడ్డంగా పట్టుబడ్డ పోలీసు అధికారి! | Officer fired after being caught up in prostitution sting | Sakshi
Sakshi News home page

అడ్డంగా పట్టుబడ్డ పోలీసు అధికారి!

Published Thu, Apr 21 2016 2:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

అడ్డంగా పట్టుబడ్డ పోలీసు అధికారి!

అడ్డంగా పట్టుబడ్డ పోలీసు అధికారి!

ఫ్లోరిడా: వేశ్యలోలుడైన ఓ పోలీసు ఉన్నతాధికారి స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. వేశ్యగా భావిస్తూ ఓ మహిళకు 20 డాలర్లు ఇచ్చి.. ఓరల్‌ సెక్స్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె అండర్‌ కవర్‌లో ఉన్న మహిళా పోలీసు కావడంతో ఆ అధికారి బండారం బయటపడింది. ఈ వ్యవహారంలో అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా పోలీసు అధికారి వింటైర్‌ ఫిన్నీపై గతవారం వేటుపడింది. పోలీసు అధికారి అయినప్పటికీ వృత్తి ధర్మానికి కట్టుబడకుండా అసాంఘిక చర్యలకు పాల్పడినందుకు ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు బోయన్‌టన్‌ బీచ్‌ పోలీసు మహిళా అధికారి ప్రతినిధి స్టెఫానీ స్లాటర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

సీనియర్ పోలీసు అధికారి అయిన ఫిన్నీ గత అక్టోబర్‌ నుంచి పెయిడ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెలవులో ఉన్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు ఈ అండర్ కవర్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అండర్‌ కవర్‌లో ఉన్న మహిళా పోలీసుతో అతడి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పోలీసుశాఖ విడుదల చేసింది. అయితే, తన క్లయింట్ అమాయకుడని, ఈ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో అతనిపై నేరపూర్వక అభియోగాలు మోపరాదని ఫిన్నీ లాయర్‌ జాన్‌ హోవె తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement