పిల్లి కాదు.. పి..పి..ల్లి..ల్లి..!
'మాగ్గీ ఒమర్' ప్రపంచలోనే అత్యంత పొడవైన పిల్లిగా త్వరలో రికార్డులకెక్కనుంది. దీని యజమానురాలు స్టెఫానీ(29).. ఒమర్‌ను కొనుగోలు చేసినప్పుడు చాలా చిన్నగా ఉండేదని తెలిపింది. ఏడాదికేడాదికి బరువు విపరీతంగా పెరుగుతుండటంతో తొమ్మిది కేజీలు అవుతుందని తాను భావించినట్లు తెలిపింది.
కానీ, మూడేళ్లలో 14 కేజీల బరువు పెరిగిన ఒమర్.. 3.9 అడుగుల పొడవు కూడా పెరిగినట్లు వెల్లడించింది. దీంతో ప్రపంచ రికార్డు కోసం గిన్నిస్‌బుక్ రికార్డ్స్‌ను సంప్రదించినట్లు తెలిపింది. ప్రస్తుతం గిన్నిస్ బుక్ అధికారులు ఒమర్‌ను రికార్డుల్లోకి చేర్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు వివరించింది.