'చెప్పడానికేముంది?స్నానంచేస్తోన్న అమ్మాయి ఫొటో..' అంటారా?
అంత సులువుగా సమాధానం చెప్పగలిగే విషయమైతే ఇది అంతర్జాతీయ వార్త ఎందుకవుతుంది? మరోసారి పరికించి చూడండి..
అవును. ఇది ఫొటో కాదు.. పక్కా పెయింటింగ్. హైపర్ రియలిస్టిక్ వాటర్ పెయింటింగ్.
తనకంటూ ఘనమైన చరిత్ర ఎంతో ఉన్నా, వర్తమానంలో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, రాజకీయ అనిశ్చితుల నడుమ కునారిల్లిపోతోన్న ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన ఓ యువ చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత చిత్రాలివి.
అతని పేరు ఒరెసెగున్ ఒలుమిదె. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ఆసక్తి. అంతంత ప్రోత్సాహంతోనే లాగోస్(నైజీరియాలోనే కాక ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద నగరం)లోని యబా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేసి కోర్సు పూర్తిచేశాడు. 2005 నుంచి సీరియస్ గా బొమ్మలు గీస్తున్నాడు. హైపర్ రియలిజం ఉట్టిపడేలా ఒలుమిదె చిత్రిస్తోన్న పెయింటింగ్స్ కు ఇటీవల విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో 20 వేల మందికిపైగా యూజర్లు అతణ్ని ఫాలో అవుతున్నారు.
నీటికి శత్రువులుండరు.. అనే తన యొరుబా తెగ పెద్దలు చెప్పే మాటలతో నీళ్లపై అమితమైన ప్రేమను పెంచుకున్న మన కళాకారు వాటర్ బ్యాగ్రౌండ్ లో వేలకొద్దీ చిత్రాలు గీశాడు. వాటిలో కొన్నే ఇవి. 'స్వచ్ఛంగా ప్రకాశించే నీళ్లన్నా, వాటిని సజీవంగా చిత్రీకరించే వాటర్ పెయింగ్స్ అన్నా నాకు ప్రాణం. సాధారణంగా నా చుట్టూ ఉండే పరిసరాలే నా పెయింటిగ్స్ కు థీమ్స్'అని చెబుతాడు ఒలుమిదె.
ఇవేంటో మీరే చెప్పాలి..!
Published Fri, Mar 11 2016 9:40 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
Advertisement