భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్
భారత జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లమన్న పాకిస్తాన్
Published Sat, May 10 2014 6:11 PM | Last Updated on Tue, Aug 7 2018 4:15 PM
పాకిస్తాన్ మన దేశానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులను తమ దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది. వీరిద్దరినీ ఒక వారం లోపు పాకిస్తాన్ వదలి వెళ్లమని ఆజ్ఞ జారీ చేసింది.
'ది హిందూ' కరస్పాండెంట్ మీనా మెనన్, పీటీఐ కరస్పాండెంట్ స్నేహేశ్ ఫిలిప్ ల వీసాలను పొడగించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. వీరిద్దరూ గత ఏడాది ఆగస్టు నుంచి ఇస్లామాబాద్ లో పనిచేస్తున్నారు. వీరి వీసాల గడువు ఈ ఏడాది మార్చి 9 న ముగిసింది. దీనితో వీరిద్దరు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే వీసాల నిరాకరణకు, వారిని దేశం విడిచి వెళ్లమనడానికి గల కారణాలు మాత్రం పాకిస్తాన్ వెల్లడించలేదు.
Advertisement
Advertisement