బొమ్మ తుపాకీ పట్టుకున్న బాలురపై పాక్ పోలీసు కాల్పులు
లాహోర్: డమ్మీ తుపాకీతో సెల్ఫీ దిగాలనుకుని ఓ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో సోమవారం జరిగింది. ఫర్హాన్(15), ఫహాద్(14) బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగి సోషల్ సైట్లలో తమ ఫొటోలు పెట్టాలని భావించారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే తుపాకీతో ఉన్న వీరిద్దరినీ చూసిన ఓ పోలీసు అధికారి.. వారిని దొంగలుగా భావించి ఎటువంటి హెచ్చరికలూ లేకుండా కాల్పులకు దిగాడు.
దీంతో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఫర్హాన్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దోపిడీకి ప్రయత్నించారని భావించి తాను వారిపై కాల్పులు జరిపినట్టు ఎస్‌హెచ్‌వో ఫర్యాద్ చీమా తెలిపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి చీమా, మరో నలుగురు అధికారులను అరెస్ట్ చేశామని, వారిపై హత్య కేసు నమోదు చేశామని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనావుల్లా తెలిపారు.
సెల్ఫీ ఖరీదు ప్రాణం..!
Published Wed, Jun 24 2015 2:04 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM
Advertisement