ఇస్లామాబాద్: గడిచిన ఏడాదికాలంలో తాము 686 మందిని చంపేశామంటూ పాకిస్థాన్ తాలిబన్ సంస్థ తొలిసారి తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అయితే తాలిబన్లు తమ బలాన్ని అధికంగా చాటుకోవడానికి మృతుల సంఖ్యను పెంచి చెప్తున్నారని, పాకిస్థాన్‌లో ఇటీవల భద్రత మెరుగుపడిందని నిపుణులు చెప్తున్నారు.
జనవరి 3 నుంచి డిసెంబర్ 26 మధ్యకాలంలో పాకిస్థాన్ నగరాలు, వాయవ్య గిరిజన ప్రాంతంలో భద్రతా దళాలు, పోలీసులు, రాజకీయ నాయకులు లక్ష్యంగా తాము చేసిన దాడుల వివరాలను ఉర్దూలో రాసిన ఈ నివేదికలో తాలిబన్లు వెల్లడించారు. 2015లో మొత్తంగా 73 లక్షిత హత్యలను చేశామని, 12 మెరుపు దాడులు, 10 దాడులు, 19 ఐఈడీ పేలుళ్లు, ఐదు ఆత్మాహుతి దాడులు, 17 క్షిపణి దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో మొత్తంగా 686 మంది చనిపోయారని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ తాలిబాన్ (టీపీపీ) తెలిపింది. సెప్టెంబర్‌లో పెషావర్ ఎయిర్‌బేస్‌పై తాము జరిపిన దాడిలో 247 మంది చనిపోయారని టీపీపీ తన నివేదికలో పేర్కొంది. అయితే అధికారికంగా మాత్రం 29మంది మాత్రమే చనిపోయినట్టు పాక్ ప్రభుత్వం తెలిపింది.
'2015లో మేం 686 మందిని చంపేశాం'
Published Wed, Jan 6 2016 1:59 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement
Advertisement