రన్వేపై విమాన ప్రమాదం | Plane's landing gear collapses while departing | Sakshi
Sakshi News home page

రన్వేపై విమాన ప్రమాదం

Published Sun, Oct 5 2014 9:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

రన్వేపై విమాన ప్రమాదం

రన్వేపై విమాన ప్రమాదం

లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మెక్సికో బయలుదేరుతున్న సమయంలో ఎరోమెక్సికో జెట్ విమానం ప్రమాదానికి గురైంది. విమాన రన్వేపై ఏర్పాటు చేసిన వేగ నిరోధకాన్ని ఆ విమానం ఢీ కొట్టింది. దీంతో విమానం ఎడమ చేతి భాగం దెబ్బతిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 129 మంది ప్రయాణికులు ఉన్నారని.... వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రయాణికులకు మరో విమానంలో వారి గమ్యస్థానానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement