ఇస్లామాబాద్: సింధు నదీ జలాల ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్‌ల పరస్పర అంగీకారంతో 1960లో కుదిరిందని, ఏ ఒక్క దేశం ఏకపక్షంగా ఒప్పందం నుంచి తప్పుకోలేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ భద్రతకు అంతర్గతంగాను, బయటి దేశాల నుంచి కూడా ఏ ముప్పూ లేదని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని బుధవారం అధికారులతో జరిగిన భేటీలో అన్నారు.
ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అధీనంలో ఉన్న నదుల్లోని నీటిని గరిష్టంగా వినియోగించాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాక్ ప్రతినిధుల బృందం ప్రపంచ బ్యాంకు అధికారులతో భేటీ అయింది. ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన బ్యాంకు తటస్థంగా ఉంటూనే ఒప్పంద అంశాన్ని సకాలంలో పూర్తిచేసే బాధ్యత తనకు ఉందని పేర్కొన్నట్లు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఏకపక్షంగా తప్పుకోవద్దు: పాక్ ప్రధాని
Published Thu, Sep 29 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
Advertisement