రష్యా సైనిక దళం (పాత ఫొటో)
మాస్కో : మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రష్యా ప్రజలను ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ రోస్సియా-24 శనివారం హెచ్చరికలు చేసింది. సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. బాంబు షెల్టర్‌లలో ఉంటున్న సమయంలో ఐయోడిన్ ప్యాకెట్లను దగ్గరలో ఉంచుకుని రేడియేషన్‌కు గురి కాకుండా శరీరానికి రాసుకోవాలని చెప్పింది.
ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. బియ్యం, ఓట్స్ వంటి ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం వల్ల వాటిని ఎక్కువకాలం వినియోగించడానికి అవకాశం ఉంటుందని వివరించింది.
సిరియా అంతర్యుద్ధంలో భాగంగా ప్రపంచం రెండో క్షిపణులు క్రైసిస్‌ను ఎదుర్కొంటుందని రష్యా దేశ రక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఈ కోల్డ్‌వార్ చాపకింద నీరులా వచ్చిందని, అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదని, ఇప్పుడు తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తొలి కోల్డ్ వార్ కంటే ఈ వార్ అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment