third world war
-
అదను చూసి దెబ్బ.. ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ అల్టిమేటం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మూడో ప్రపంచ యుద్ధం అంశం తెర మీదకు వచ్చింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై తాజా దాడుల్ని ఇరాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా సమర్థించుకుంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రతా మండలి వైఫల్యాన్ని ఇరాన్ ఎండగట్టింది. ‘‘అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడం భద్రతా మండలి బాధ్యత. కానీ, గత కొన్ని నెలలుగా ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో భద్రతా మండలి ఘోరంగా విఫలమైంది. గత్యంతరం లేకనే ఆత్మరక్షణ కోసం ఇరాన్, ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు పాల్పడాల్సి వచ్చింది. మా(ఇరాన్) దేశం యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని కోరుకోదు. కానీ, బెదిరింపులకు, ఆక్రమణలకు, దాడులకు తెగబడితే మాత్రం గట్టిగానే స్పందిస్తుంది అని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ తెలిపారు. ఇదిలా ఉంటే.. దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. అయితే ఆ దాడుల్ని బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ, మిత్రదేశాల సాయంతో అంతే సమర్థవంతంగా తిప్పి కొట్టింది ఇజ్రాయెల్. ఇక.. ఈ దాడులకు అదను చూసి తగిన రీతిలో ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంట్జ్ తాజాగా ప్రకటించారు. This is what a 99% interception rate looks like. Operational footage from the Aerial Defense System protecting the Israeli airspace: pic.twitter.com/eAwcUPUDw2 — Israel Defense Forces (@IDF) April 14, 2024 సిరియా డమాస్కస్‌లో ఇరాన్ కాన్సులేట్ భవనాన్ని ఇజ్రాయెల్ మిస్సైల్స్ నేల మట్టం చేట్టాయి. అయితే ఈ చర్యకు పాల్పడింది తాము కాదని, ఈ ప్రాంతంలోని ఇతరత్రా శక్తులని ఇజ్రాయెల్ ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే మధ్యలో పవిత్ర రంజాన్ మాసం రావడంతో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. మధ్యలో అమెరికాకు కూడా ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇది తమకు ఇజ్రాయెల్‌కు నడుమ పోరు అని, ఇందులో అమెరికా తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షులు జో బైడెన్‌కు హెచ్చరికలు పంపించింది. మిలిటరీ శక్తిలో బలం ఉన్న ఇరాన్ ప్రతిగానే ఇప్పుడు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. అయితే ఇరాన్ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ముందుకు వచ్చింది. ఇరాన్లో 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ నాటి నుంచి కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఉద్రిక్తతలు ఉంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల నడుమ ఇది డైరెక్ట్ అటాక్ దశకు చేరింది. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా ఈ దాడికి తమ ప్రతిదాడి తీవ్రస్థాయిలోనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇరాన్ తమ దేశానికి పాత శత్రువు. ఈ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని, ఈ క్రమంలో ఇక తమ ప్రతిచర్య తప్పదని ఆదివారం ఆయన ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. -
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: రష్యా మీడియా
రష్యా అధికారిక మీడియా సంచలన ప్రకటన చేసింది. మూడో ప్రపంచ యుద్దం మొదలైపోయినట్లేనని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో.. యుద్ధ నౌక మాస్కోవా మునకతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని రష్యా వన్‌లో ప్రసారం అయ్యింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా అగ్నిప్రమాదంలో.. దెబ్బతిన్నదని క్రెమ్లిన్ ప్రకటించున్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ మాత్రం.. తమ నెప్ట్యూన్ క్షిపణి ద్వారా నల్ల సముద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రధాన నౌకను నాశనం చేసినట్లు గర్వంగా ప్రకటించుకుంది. ఈ ఘటనను ఉద్దేశిస్తూ రష్యా ప్రభుత్వ ఛానెల్ ‘రష్యా 1’ ఛానెల్ ప్రజెంటర్ ఒల్గా స్కాబెవెయా ఓ డిబెట్లో.. అధికారంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ప్రకటన చేశారు. ‘‘నాటోకు పూర్తి వ్యతిరేకంగా ఇప్పుడు మనం పోరాడుతున్నాము. నాటో గుర్తించకపోయినా.. ఇప్పుడు మనం అది గుర్తించాల్సిందే. ముఖ్యమైన ప్రకటన.. ఇది మూడో ప్రపంచ యుద్ధం.. ఆల్రెడీ మొదలైపోయింది’’ అంటూ వ్యూయర్స్‌ను ఉద్దేశిస్తూ ఆవేశపూరితంగా ఆమె మాట్లాడారు. అదే షోలో గెస్ట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి.. రష్యన్ గడ్డపై దాడికి మాస్కోవా మునిగిపోయింది అంటూ క్రెమ్లిన్ చేసిన అగ్నిప్రమాద ఘటన ప్రకటనకు విరుద్ధంగా కామెంట్లు చేశాడు. అయితే.. ఇది ప్రత్యేక సైనికచర్య అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన.. సదరు ప్రజెంటర్కు గుర్తుచేశారు. అయినప్పటికీ ఆమె మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. Olga Skabeyeva Russian Media broadcast with commentators calling for all out war after sinking of Moscow, including bombing and possibly discussing dropping "a single bomb on Kyiv" to keep world leaders from visiting. #RussianUkrainianWar pic.twitter.com/R0uOLol0FV — EyesFromUkraine (@NowInUkraine) April 15, 2022 ఇప్పటిదాకా రష్యా మీడియా ఛానెల్స్ ఏవీ కూడా.. ఉక్రెయిన్‌పై యుద్ధంగా కాకుండా పుతిన్ ప్రకటించినట్లుగానే ‘ప్రత్యేక సైనిక చర్య’గా ఇంతకాలం అభివర్ణిస్తూ వచ్చాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఛానెల్ నుంచి నేరుగా యుద్ధ ప్రకటన.. అదీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు రావడం విశేషం. మరో ప్రభుత్వ ఛానెల్లో కూడా ఉక్రెయిన్ వ్యతిరేక ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాల ఆదేశాలను శిరసావిస్తూ.. మరిన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమిస్తోందని, రక్తపాతం..హింసను ఊహించని స్థాయిలో కోరుకుంటుందేమోనని ఛానెల్ యాంకర్ ఒలెస్యా లోసెవా వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. బుచా మారణహోమం, అత్యాచారాలను ఆయుధంగా వాడుకుంటోందంటూ రష్యాపై ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు ఆరోపణలకు దిగాయి. ఐరాసతో సహా అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో.. రష్యాకు నష్టమేమీ లేదంటూనే.. ఆ దేశాలకు కౌంటర్ గట్టిగానే ఇవ్వాలని పుతిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా ప్రైడ్ రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌకే మాస్కోవా. దీనిని మిసైల్స్‌తో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు గురువారం ప్రకటించారు. అయితే తమ నౌకలో అగ్నిప్రమాదం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. ప్రమాదం పెద్దదే కానీ నౌక మునిగిపోలేదని, దాన్ని దగ్గరలోని నౌకాశ్రయానికి చేర్చామని వెల్లడించింది. అయితే.. తిరుగు ప్రయాణంలో అది మునిగిపోయినట్లు కాసేపటికే సవరణ ప్రకటన చేసింది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. నౌకలో ఆయుధాలు పేలడంతో నిప్పంటుకుందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. సిబ్బందితో పాటు నౌకకున్న మిసైల్ లాంచర్లు సురక్షితమేనని పేర్కొంది. చదవండి: కీవ్‌పై మిస్సైల్స్ వర్షం తప్పదు.. క్రెమ్లిన్ హెచ్చరికలు -
మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంకండి : రష్యా
మాస్కో : మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రష్యా ప్రజలను ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ రోస్సియా-24 శనివారం హెచ్చరికలు చేసింది. సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించింది. బాంబు షెల్టర్లలో ఉంటున్న సమయంలో ఐయోడిన్ ప్యాకెట్లను దగ్గరలో ఉంచుకుని రేడియేషన్‌కు గురి కాకుండా శరీరానికి రాసుకోవాలని చెప్పింది. ఆహార పదార్థాలను కూడా దాచిపెట్టుకోవాలని అందులో ఎక్కువ మొత్తం నీరు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. బియ్యం, ఓట్స్ వంటి ఆహారపదార్థాలను భద్రపరచుకోవడం వల్ల వాటిని ఎక్కువకాలం వినియోగించడానికి అవకాశం ఉంటుందని వివరించింది. సిరియా అంతర్యుద్ధంలో భాగంగా ప్రపంచం రెండో క్షిపణులు క్రైసిస్‌ను ఎదుర్కొంటుందని రష్యా దేశ రక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఈ కోల్డ్‌వార్ చాపకింద నీరులా వచ్చిందని, అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదని, ఇప్పుడు తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తొలి కోల్డ్ వార్ కంటే ఈ వార్ అత్యంత ప్రమాదకరంగా ఉండబోతోందని హెచ్చరించారు. -
మూడో ప్రపంచ యుద్ధం ఎలా వస్తుందంటే..
సాక్షి, న్యూయార్క్ : కృత్రిమ మేథస్సు ఉన్న రోబోల మధ్య పోటీ, పైచేయి సాధించటానికి జరిగే ప్రయత్నంలో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. అయితే, కృత్రిమ మేథస్సు రోబోల రూపకల్పన రేసులో అమెరికా, చైనా, ఇండియా ముందుంటాయని అన్నారు. దాదాపు అన్ని దేశాలూ కృత్రిమ మేథస్సుపై పరిశోధనలు జరుపుతున్నాయని ఆయన తెలిపారు. ఈ రంగంలో ఉండే ప్రైవేట్ సంస్థలను సైతం ప్రభుత్వాలు నియంత్రించి తమ ఆధీనంలో ఉంచుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. మూడో ప్రపంచ యుద్ధం కారణంగా మానవ నాగరికతకు ముప్పు ఉన్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా మాత్రం లేదని చెప్పారు. రష్యాతోపాటు అన్ని దేశాలకు కృత్రిమ మేథస్సు కీలకమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనపై ఆయన సోమవారం పలు ట్వీట్లు చేశారు. China, Russia, soon all countries w strong computer science. Competition for AI superiority at national level most likely cause of WW3 imo. — Elon Musk (@elonmusk) 4 September 2017 యుద్ధంలో విజయం సాధించటానికి అకస్మాత్తుగా చేపట్టే దాడులే కీలకమని కృత్రిమ మేథస్సు రోబోలు నమ్ముతాయని, మూడో ప్రపంచ యుద్ధానికి ఈ నమ్మకమే కారణమని ఆయన చెప్పారు. అయితే, ఎలాన్ మస్క్ ట్వీట్లను ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ ఖండించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ జుకర్‌బర్గ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌పై తెలిసింది కొంత మాత్రమేనని వ్యాఖ్యానించారు. -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదట!
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. ఎవరి నాయకత్వాన ఆ బృందాలు ఏర్పాడతాయనే విషాయాన్ని మాత్రం తెలపలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు. రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా చిత్రమైన మాస్క్ ధరించాడు. -
మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?
త్వరలో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా రాబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అమెరికా.. రష్యాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఈ విషయం నేరుగా ప్రకటించకపోయినా.. దేశాధ్యక్షుల ప్రకటనలు, వాళ్ల సూచలను బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న రష్యా అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరిగి స్వదేశానికి వచ్చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నందున వెంటనే తిరిగి వచ్చేయాలని అన్నారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మరోసారి చెడిపోతున్నాయి. సిరియా విషయంలో అమెరికా మెప్పుకోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని, అందుకే ఐక్యరాజ్య సమితి తీర్మానంపై వీటో చేసేందుకు తమను లాగుతోందని పుతిన్ ఆరో్పించారు. ఆ తర్వాతి నుంచి రష్యా, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు కూడా చెడిపోయాయి. అలెప్పోలో యుద్ధ నేరాలకు పాల్పడిన సిరియన్ బలయగాలకు సాయం చేసేందుకు రష్యా వైమానిక దాడులు జరుపుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఆరోపించడంతో.. ఆయనతో జరగాల్సిన భేటీని పుతిన్ రద్దుచేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. త్వరలోనే పెద్ద యుద్ధం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ అన్నారు. ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని రష్యా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎవ్‌గెనీ బుజిన్స్కీ చెప్పారు. సిరియా గురించి జరుగుతున్న చర్చల నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించుకున్నప్పటి నుంచి అమెరికా - రష్యా సంబంధాలు చెడిపోవడం మొదలైంది. దానికి తోడు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీలో కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురి కావడం, దాని వెనుక రష్యా ప్రభుత్వం ఉందని చెప్పడంతో.. పరస్పర ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. -
ట్రంప్ కావాలా.. అణుయుద్ధం కావాలా?
వచ్చే నెలలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌నే ఎన్నుకోవాలని.. లేనిపక్షంలో అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహిత సహచరుడు ఒకరు హెచ్చరించారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలుచేస్తూ.. రష్యన్ ట్రంప్‌గా పేరొందిన వ్లాదిమిర్ జిరినొవ్స్కీ రాయిటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. మాస్కోకు.. వాషింగ్టన్కు మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించగల ఏకైక వ్యక్తి ట్రంప్ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జిరినొవ్స్కీ హెచ్చరించారు. గత నెలలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో జిరినొవ్స్కీ ప్రాతినిధ్యం వహించే లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ రష్యా మూడోస్థానంలో నిలిచింది. అయితే రష్యాలో చాలామంది ఆయనను ఒక జోకర్లా భావిస్తుంటారు. అందరి దృష్టి తనమీద పడాలన్న ఉద్దేశంతో ఆయన ప్రతి అంశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. క్రెమ్లిన్ విధానాలకు బాగా కట్టుబడి ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి ఒక్కోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు ఇప్పటి కంటే దారుణంగా అయ్యేందుకు అవకాశం లేదని.. యుద్ధం మొదలైతేనే అవి మరింత క్షీణిస్తాయని జిరినొవ్స్కీ అన్నారు. భూగ్రహం మీద శాంతి ఉండాలంటే అమెరికన్లు ట్రంప్‌కే ఓటు వేయాలని, కానీ వాళ్లు హిల్లరీని ఎన్నుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం.. అది కూడా అణుయుద్ధం తప్పదని చెప్పారు. ప్రతిచోటా హిరోషిమా, నాగసాకిలే కనపడతాయని హెచ్చరించారు.